PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/laskshi-paravthi-jagan-ntrf110546f-0825-41ec-b86d-700dd86db655-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/laskshi-paravthi-jagan-ntrf110546f-0825-41ec-b86d-700dd86db655-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ అంటే ఒక చ‌రిత్ర‌. ఒక అధ్యాయం. ఎంత చెప్పినా.. ఎంత వ‌ర్ణించినా.. ఇంకా మిగిలే ఉండే ఓ గొప్ప పుస్త‌కం. అలాంటి న‌ట‌సార్వ‌భౌముడు, విశ్వ విఖ్యాత అయిన ఎన్టీఆర్ జ‌యంతి నేడు. దీంతో ట్యాంక్‌బండ్ లో ఉన్న ఆయ‌న ఘాట్ వ‌ద్ద ఎంతోమంది నివాళి అర్పించారు. అయితే ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ పార్వ‌తి కూడా ఈ సంద‌ర్భంగా నివాళి అర్పించారు. అయితే ఆమెకంటే ముందు నంద‌మూరి వార‌సులు ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాట్లాడుతూ ఇన్‌డైరెక్టుగా నంద‌మూరి వార‌సులు, చlaskshi paravthi, jagan, ntr{#}NTR;nandamuri taraka rama rao;vishwa;CM;Reddy;TDPఎన్టీఆర్ అస‌లైన వార‌సుడు జ‌గ‌నేః ల‌క్ష్మీపార్వ‌తిఎన్టీఆర్ అస‌లైన వార‌సుడు జ‌గ‌నేః ల‌క్ష్మీపార్వ‌తిlaskshi paravthi, jagan, ntr{#}NTR;nandamuri taraka rama rao;vishwa;CM;Reddy;TDPFri, 28 May 2021 17:30:00 GMTఎన్టీఆర్ అంటే ఒక చ‌రిత్ర‌. ఒక అధ్యాయం. ఎంత చెప్పినా.. ఎంత వ‌ర్ణించినా.. ఇంకా మిగిలే ఉండే ఓ గొప్ప పుస్త‌కం. అలాంటి న‌ట‌సార్వ‌భౌముడు, విశ్వ విఖ్యాత అయిన ఎన్టీఆర్ జ‌యంతి నేడు. దీంతో ట్యాంక్‌బండ్ లో ఉన్న ఆయ‌న ఘాట్ వ‌ద్ద ఎంతోమంది నివాళి అర్పించారు. అయితే ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ పార్వ‌తి కూడా ఈ సంద‌ర్భంగా నివాళి అర్పించారు.

అయితే ఆమెకంటే ముందు నంద‌మూరి వార‌సులు ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాట్లాడుతూ ఇన్‌డైరెక్టుగా నంద‌మూరి వార‌సులు, చంద్ర‌బాబును టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ అస‌లైన వార‌సుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని తేల్చి చెప్పారు నందమూరి లక్ష్మీపార్వతి. కడుపున పుట్టినంత మాత్రాన ఎన్టీఆర్ వారసులు కాద‌ని ఇన్ డైరెక్టుగా నంద‌మూరి వార‌సులు, నారా చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్ప‌టికే ఎన్నోసార్లు నంద‌మూరి వార‌సుల‌పై విరుచుకుప‌డ్డ ఆమె ఇప్పుడు మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలు అమలు చేసే వారే ఆయ‌న సిసలైన వారసులని అలాంటి వ్య‌క్తి ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మేన‌ని వివ‌రించారు. ఎన్టీఆర్ ఆశయాలను అనేక సంక్షేమ పథకాల రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

కాబ‌ట్టి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు, రాజ‌కీయాల‌కు అస‌లు సిస‌లైన వారసుడ‌ని ఆమె చెప్పారు. అయితే ఈమె వ్యాఖ్య‌ల‌తో టీడీపీ భ‌గ్గుమంటోంది. క‌డుపున పుట్టిన నంద‌మూరి వార‌సులు చాలామంది ఉండ‌గా.. వేరే వారిని ఎలా వార‌సులుగా ల‌క్ష్మీపార్వ‌తి చెబుతారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రీ ఇంత‌లా మాట్లాడ‌టం త‌గ‌దంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ల‌క్ష్మీపార్వ‌తి చేసిన వ్యాఖ్య‌ల‌పై అటు టీడీపీ అగ్ర నేత‌లు గానీ, ఇటు ఎన్టీఆర్ వార‌సుల నుంచి గానీ ఏమీ స్పందించ‌లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీలో లాక్‌డౌన్ అన్‌లాక్..?

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?

క‌రోనా వేళ అండ‌గా ఆర్ఎస్ఎస్ .. ఏ చేస్తున్నారంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>