TVDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-depam-seril-lost-eandiong-malayam-ebaca355-9bd7-4fd0-8a9d-8d958f521f74-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-depam-seril-lost-eandiong-malayam-ebaca355-9bd7-4fd0-8a9d-8d958f521f74-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై అత్యధికంగా టీ ఆర్ పీ రేటింగ్ సాధించిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి.అంతే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం సీరియల్ ఏదైనా ఉందంటే, స్టార్ మా లో కేవలం కార్తీకదీపం సీరియల్ అని చెప్పవచ్చు. ఈ సీరియల్ ఏకంగా గత మూడేళ్లుగా నెంబర్ వన్ టీ ఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు సైతం రాని టీ ఆర్ పీ రేటింగులు కార్తీకదీపం సీరియల్ కు రావడం గమనార్హం. 2017 సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతున్న ఈ సీరియల్ లో, వంటలక్క అలియాస్ దKARTHIKA DEPAM SERIL LOST EANDIONG MALAYAM{#}Telugu;Evening;Star maa;October;Premi Viswanath;Mahanati;News;Remake;deepa;Cinema;Doctor;American Samoa;collectorటీవీ : కార్తీకదీపం సీరియల్ అక్కడ ఎలా ముగిసిందో తెలుసా ?టీవీ : కార్తీకదీపం సీరియల్ అక్కడ ఎలా ముగిసిందో తెలుసా ?KARTHIKA DEPAM SERIL LOST EANDIONG MALAYAM{#}Telugu;Evening;Star maa;October;Premi Viswanath;Mahanati;News;Remake;deepa;Cinema;Doctor;American Samoa;collectorFri, 28 May 2021 02:00:00 GMT
బుల్లితెరపై అత్యధికంగా టీ ఆర్ పీ రేటింగ్ సాధించిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి.అంతే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం సీరియల్ ఏదైనా ఉందంటే, స్టార్ మా లో  కేవలం కార్తీకదీపం సీరియల్ అని చెప్పవచ్చు. ఈ సీరియల్ ఏకంగా గత మూడేళ్లుగా నెంబర్ వన్ టీ ఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు సైతం రాని టీ ఆర్ పీ రేటింగులు కార్తీకదీపం సీరియల్ కు రావడం గమనార్హం.


2017 సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతున్న ఈ సీరియల్ లో, వంటలక్క అలియాస్ దీపగా నటిస్తున్న ప్రేమీ విశ్వనాధ్ అభినయం పెద్ద అసెట్ అనే చెప్పాలి. ఎంత సేపు అయిన బాధ కలిగించే ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో ప్రేమీ విశ్వనాధ్ కు సాటిరారు. ఇంకా చెప్పాలంటే, ఆ విషయంలో ఆమెను మహానటి అని చెప్పుకోవాలి. అయితే ఈ సీరియల్ త్వరలో తొలి సీజన్ పూర్తవుతుందని, తర్వాత సీజన్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రసారమవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే మూడేళ్ల పాటు సుదీర్ఘంగా టీ ఆర్ పీ రేటింగ్ తో ఉన్న ఈ సీరియల్ చివరి వరకూ ఇదే టీ ఆర్ పీ రేటింగ్ తో ముగించాలని నిర్మాతలు భావిస్తున్నారని వినికిడి.

అయితే తెలుగులో వస్తున్న కార్తీకదీపం రీమేక్ మలయాళం కారుముత్తు సీరియల్ నుంచి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇది ఏడు సంవత్సరాలపాటు ప్రసారమై ముగిసిపోయింది. ఇక ఆ సీరియల్లో కూడా దీప క్యారెక్టర్ ను ప్రేమీ విశ్వనాథ్ పోషించడం గమనార్హం. కానీ మలయాళం సినిమా సీరియల్ లో దీప, డాక్టర్ బాబు లకు కవల పిల్లలు ఉండరు. ఒక కూతురు ఉంటుంది. మలయాళం మాతృక లో వంటలక్కకు ఆక్సిడెంట్ అయి అదృశ్యమైపోయి, గతం మరిచిపోతే, ఆమెను మరొక కుటుంబం చేరదీస్తుంది. ఇక డాక్టర్ బాబు అనారోగ్యం పాలై అమెరికా వెళ్లిపోగా, వారి కుమార్తె పెరిగి పెద్దయ్యాక కలెక్టర్ అవుతుంది. అలా సెకండ్ సీజన్ మలయాళంలో మొదలై, ఇక కుటుంబం అంతా ఒక దగ్గరకు చేరడంతో ఆ సీరియల్ ముగిసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో చెప్పేందుకు ఆ ఒక్క డైలాగ్‌ చాలు..!

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>