MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr4d1d923e-066a-4493-870b-51963670da14-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr4d1d923e-066a-4493-870b-51963670da14-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఆ తరం దర్శకులంతా అన్న గారితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆయనను డైరెక్ట్ చేయాలని కలలు కనే వాళ్ళు. ఎంత మంది హీరోలతో సినిమాలు చేసినా కూడా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే దర్శకులు తెలుగులో చాలామంది ఉండేవాళ్ళు. అప్పట్లో కుర్రాళ్ళు గా వచ్చి ఎన్టీఆర్ ఇమేజ్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేసిన రాఘవేంద్రరావు, దాసరి లాంటి దర్శకులు పోటీపడి మరి ఆయన తో ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేశారు. అదే దారిలో మరికొంత మంది దర్శకులు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేశారు. అలా ఆయనతో ఒక్క సSr.ntr{#}Cinema;Darsakudu;Director;NTR;nandamuri taraka rama rao;Industry;Success;Chiranjeevi;editor mohan;historyఎన్టీఆర్ సినిమా అవకాశం ఇస్తే కాదన్న దర్శకుడుఎన్టీఆర్ సినిమా అవకాశం ఇస్తే కాదన్న దర్శకుడుSr.ntr{#}Cinema;Darsakudu;Director;NTR;nandamuri taraka rama rao;Industry;Success;Chiranjeevi;editor mohan;historyFri, 28 May 2021 17:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఆ తరం దర్శకులంతా అన్న గారితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆయనను డైరెక్ట్ చేయాలని కలలు కనే వాళ్ళు. ఎంత మంది హీరోలతో సినిమాలు చేసినా కూడా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే దర్శకులు తెలుగులో చాలామంది ఉండేవాళ్ళు. అప్పట్లో కుర్రాళ్ళు గా వచ్చి ఎన్టీఆర్ ఇమేజ్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేసిన రాఘవేంద్రరావు, దాసరి లాంటి దర్శకులు పోటీపడి మరి ఆయన తో ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేశారు. అదే దారిలో మరికొంత మంది దర్శకులు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేశారు. అలా ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో.

అలాంటిది ఓ దర్శకుడు మాత్రం పిలిచి అవకాశం ఇచ్చినా కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయనని చెప్పేశాడు. అదేంటి ఎన్టీఆర్ సినిమానే కాదని ధైర్యం చేసిన దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా.. 93 సినిమాలను డైరెక్ట్ చేసి అందులో దాదాపు 80 శాతం సక్సెస్ రేటు కలిగి ఉన్న దర్శకుడు కోదండరామిరెడ్డి. ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి , బాలయ్య, వెంకీ, నాగార్జున, మోహన్ బాబు సహా అందరు హీరోలు దాదాపు ఈ దర్శకుడితో సినిమాలు చేయగా ఎన్టీఆర్  సినిమా చేసే అవకాశం వచ్చినా దాన్ని వదిలేసుకున్నాడట. దానికి కారణం లేకపోలేదు.. ఎనభైల్లో ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేశాడు కోదండరామిరెడ్డి. ఈయన ఇంటి ముందు వరుసగా 20 కార్లు ఆగేవి.

అంత బిజీగా ఉన్నప్పుడు కూడా అన్నగారు పిలిచి రెండుసార్లు ఆయనకు సినిమా చేయాలంటూ ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడు ఉన్న బిజీ కారణంగా ఆయన ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. అయినా అన్నగారిని డైరెక్ట్ చేసి ఉంటే తెలుగులో అందరి హీరోలతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా చరిత్ర సృష్టించే వాడు కోదండరామిరెడ్డి. కానీ ఏం చేస్తాం అప్పుడు ఉన్న కోదండరామిరెడ్డి పరిస్థితి అలాంటిది. ఎన్టీఆర్ సినిమా విలువ తెలియక  ఆయన ఇచ్చిన ఆఫర్ ను వదిలేశాను అని ఓ సందర్భంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయనతో సినిమా చేయకపోయినా కూడా రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నప్పుడు వేటగాడు సినిమా లో మాత్రం ఈ పాట చిత్రీకరించారని చెప్పాడు కోదండరామిరెడ్డి. సీనియర్ ఎన్టీఆర్ ఆఫర్ ఇస్తే కాదన్నా దర్శకుడిగా చరిత్రలో నిలిచిపోతారు కోదండరామిరెడ్డి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీలో లాక్‌డౌన్ అన్‌లాక్..?

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?

క‌రోనా వేళ అండ‌గా ఆర్ఎస్ఎస్ .. ఏ చేస్తున్నారంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>