MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-38708587-7941-4af9-ae07-efeeaa6b03c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-38708587-7941-4af9-ae07-efeeaa6b03c4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తొలితరం సూపర్ స్టార్ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు నందమూరి ఫ్యాన్స్, అలానే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆయనని గుర్తుచేసుకుంటున్నారు. తన సినిమా కెరీర్ లో దాదాపుగా 300 పైచిలుకు సినిమాలు చేసిన ఎన్టీఆర్, అప్పటి స్టార్ నటులైన ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి వారితో కలిసి పలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసారు. అయితే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి కృష్ణ కి మధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణ కంటే ఎన్టీఆర్ ఎంతో సీనియర్ అనేది తెలిసిందే. Sr-ntr{#}NTR;nandamuri taraka rama rao;Tollywood;Rajani kanth;Jayanthi;Cinema;krishnam raju;krishna;college;Chennai;bapu;Mohandas Karamchand Gandhi;Bapu1;Goodachari 116;Suresh Productions;Heroine;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;chittor v nagaiah;savitri;Savithri 1;jaggaiah;radhikaకృష్ణ తో ఎన్టీఆర్ ఎన్ని మల్టీస్టారర్ మూవీస్ చేసారో తెలుసా ...... ??కృష్ణ తో ఎన్టీఆర్ ఎన్ని మల్టీస్టారర్ మూవీస్ చేసారో తెలుసా ...... ??Sr-ntr{#}NTR;nandamuri taraka rama rao;Tollywood;Rajani kanth;Jayanthi;Cinema;krishnam raju;krishna;college;Chennai;bapu;Mohandas Karamchand Gandhi;Bapu1;Goodachari 116;Suresh Productions;Heroine;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;chittor v nagaiah;savitri;Savithri 1;jaggaiah;radhikaFri, 28 May 2021 16:46:00 GMTటాలీవుడ్ లో తొలితరం సూపర్ స్టార్ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు నందమూరి ఫ్యాన్స్, అలానే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆయనని గుర్తుచేసుకుంటున్నారు. తన సినిమా కెరీర్ లో దాదాపుగా 300 పైచిలుకు సినిమాలు చేసిన ఎన్టీఆర్, అప్పటి స్టార్ నటులైన ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి వారితో కలిసి పలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసారు. అయితే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి కృష్ణ కి మధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణ కంటే ఎన్టీఆర్ ఎంతో సీనియర్ అనేది తెలిసిందే.

ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని అయిన కృష్ణ, కాలేజీ చదివే రోజుల్లో ఒకసారి ఆయనను కలవాలని భావించి చెన్నై వెళ్లి కలుసుకుని, మీరంటే నాకు ఎంతో ఇష్టం, నాకు నటన మీద ఆసక్తి ఉంది, మీరు చేసే సినిమాల్లో ఏదైనా ఒక పాత్ర ఇప్పించండి అని అడుగగా, నువ్వు ఇంకా చిన్న కుర్రవాడివి, మరొక మూడేళ్ళ తరువాత రండి అని అన్నారని ఎన్టీఆర్ గురించి కృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఆ తరువాత కృష్ణని ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు మూవీ ద్వారా హీరోని చేయడం అది హిట్ కొట్టడం, ఆ తరువాత బాపు తీసిన సాక్షి, అలానే గూఢచారి 116 వంటి సినిమాల విజయాలతో వరుస ఛాన్స్ లు అందుకున్న కృష్ణ, ఆపై తన కెరీర్ లో ఎన్టీఆర్ తో మొత్తం ఐదు సినిమాలు చేసారు.

అందులో మొదట చేసిన సినిమా స్త్రీ జన్మ. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో కృష్ణకుమారి హీరోయిన్ గా నటించగా కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నాగయ్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కాగా ఆ తరువాత చేసిన సినిమా నిలువు దోపిడీ. దేవిక, జయలలిత, చిత్తురూ నాగయ్య, నాగభూషణం తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ మూవీ కి సీఎస్ రావు దర్శకడు. ఆపై కృష్ణ, ఎన్టీఆర్ చేసిన సినిమా విచిత్ర కుటుంబం. ప్రముఖ దర్శకడు కె ఎస్ ప్రకాశరావు తీసిన ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్ గా నటించగా విజయనిర్మల, శోభన్ బాబు, నాగభూషణం, రాజబాబు తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఆపై వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా దేవుడు చేసిన మనుషులు. జగ్గయ్య విలన్ గా నటించిన ఈ సినిమాకి పి రామచంద్ర రావు దర్శకత్వం వహించగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ ఈ మూవీని నిర్మించారు. ఇక చివరిగా ఎన్టీఆర్ తో కృష్ణ నటించిన సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు. శ్రీదేవి, రాధిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించగా జీఆర్పీ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మించింది.

కాగా కృష్ణ, ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ కొట్టడంతో పాటు అన్ని సినిమాల్లో కూడా కృష్ణ, ఎన్టీఆర్ కు సోదరుడిగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. తన సినిమా పండంటి కాపురం మూవీ 100 డేస్ ఫంక్షన్ కి విచ్చేసిన ఎన్టీఆర్, ఆ ఫంక్షన్ లోనే కృష్ణ దేవుడు చేసిన మనుషులు మూవీ అనౌన్స్ చేయడంతో సభాముఖంగా తాను కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటయించారు ఎన్టీఆర్. ఆ విధంగా తనకు, ఎన్టీఆర్ కి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని కృష్ణ ఎప్పుడూ చెప్తుంటారు ..... !!      



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీలో లాక్‌డౌన్ అన్‌లాక్..?

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?

క‌రోనా వేళ అండ‌గా ఆర్ఎస్ఎస్ .. ఏ చేస్తున్నారంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>