MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntrd222b8b2-d28c-454d-9099-0d13c092a635-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntrd222b8b2-d28c-454d-9099-0d13c092a635-415x250-IndiaHerald.jpgవిశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదు పొందిన నందమూరి తారక రామారావు అనేక పౌరాణిక, జానపద ,సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి, మెప్పించడమేగాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో, తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడు. ఎవరైనా సరే రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారు అంటే తారకరామున్ని చూపించే అంతగా ప్రేక్షకులలో దైవంగా నిలిచిపోయాడు. తెలుగువారు " అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు మే 28 1923 సాయంత్రం 4:32 కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణా జిల్లా, SR-NTR{#}రాజీనామా;Sada;nandamuri taraka rama rao;NTR;krishnudu;Telugu;Evening;Andhra Pradesh;Krishna River;Pamarru;vidya;Stree;Chennai;job;producer;Producer1;Cinema;Manadesam;March;Hyderabad;Party;Naga chaitanya;Chaitanya 1;Congress;Telugu Desam Party;history;CMమీకు సదా ఋణపడి ఉంటాను : ఎన్టీఆర్మీకు సదా ఋణపడి ఉంటాను : ఎన్టీఆర్SR-NTR{#}రాజీనామా;Sada;nandamuri taraka rama rao;NTR;krishnudu;Telugu;Evening;Andhra Pradesh;Krishna River;Pamarru;vidya;Stree;Chennai;job;producer;Producer1;Cinema;Manadesam;March;Hyderabad;Party;Naga chaitanya;Chaitanya 1;Congress;Telugu Desam Party;history;CMFri, 28 May 2021 22:00:00 GMT
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదు పొందిన నందమూరి తారక రామారావు అనేక పౌరాణిక, జానపద ,సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి, మెప్పించడమేగాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో, తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడు. ఎవరైనా సరే రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారు అంటే తారకరామున్ని చూపించే అంతగా ప్రేక్షకులలో దైవంగా నిలిచిపోయాడు.

తెలుగువారు " అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు మే 28 1923 సాయంత్రం 4:32 కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణా జిల్లా, పామర్రు మండలం లో, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. విద్య మొత్తం విజయవాడలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ముగిసింది. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నత చదువులకు చేరాడు. ఇక అప్పుడే1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో "రాచమల్లు దౌత్యం" నాటకంలో ఎన్టీఆర్ నాగమ్మ వేషం వేశారు. అలా మొదటి సారి స్త్రీ వేషం కట్టారు నందమూరి.


నందమూరి తారక రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న ఆయన జీవనం కోసం అనేక పనులు చేసాడు. పాల వ్యాపారం, కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ అప్పు మాత్రం చేసేవారు కాదు. ఇక  1942 మే నెలలో 20 ఏళ్ల వయసులోనే తన మేనమామ కుమార్తె అయిన బసవ రామతారక ను పెళ్ళి చేసుకున్నారు.


1947లో పట్టభద్రుడయ్యాడు . తరువాత మద్రాసు సర్వీస్ కమీషన్ పరీక్ష రాసాడు. అలా పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. ఇక అప్పట్లో మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి ,వెంటనే మద్రాసు పిలిపించి "పల్లెటూరి పిల్ల" సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. ఇక వెంటనే సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అయితే పల్లెటూరి పిల్ల సినిమా ఇంకా మొదలు కాకముందే," మనదేశం " సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. ఇక ఆ సినిమానే మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది.


అలా కొన్ని వందల చిత్రాలలో నటించి, తనకు ఎవరూ సాటిరారు అంటూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక తర్వాత ప్రజలకు మంచి చేకూర్చాలనే  ఆలోచనతోనే 1982 మార్చి 21న హైదరాబాద్ కు  వచ్చారు. అలా ఆయన అభిమానులు రామారావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు . ఇక 1982 మార్చి 29 సాయంత్రం రెండున్నర గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. అదే సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించాడు..

ఇక ఎన్టీఆర్ చైతన్య రథం  ఏర్పాటు చేసి, ప్రజలను చైతన్య పరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. ఆ  చైతన్యరథమే ప్రచార వేదికగా, ఆయన నివాసంగా మారిపోయింది. అలా  ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ,ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించి, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ చరిత్ర రికార్డును సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే 199 సీట్లు సాధించి, సీఎం పదవిని చేపట్టారు నందమూరి తారక రామారావు.


ఆంధ్రులు తనపై చూపించిన అభిమానానికి గాను..ఇక ఈయన చివరిసారిగా అభిమానమును మించిన ధనము, ఆదరణను మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగాలను పంచుకో గలగడం ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు ఎప్పుడూ సదా రుణపడి ఉంటాను అంటూ తన డైరీలో రాసుకున్నారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైద‌రాబాద్‌ను మించిన వైద్య సౌక‌ర్యాలు ఇక‌ ఏపీలోనే..?

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>