WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/elizabeth-bathori3cd55f41-ca0b-4497-a4ba-d99462afaae6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/elizabeth-bathori3cd55f41-ca0b-4497-a4ba-d99462afaae6-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు విశ్వవిఖ్యాత నట నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను చేశారు వీరిద్దరు. వీరిద్దరిలో కొన్ని సారూప్యాలు మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరు హీరోలు కాకముందు స్టేజి మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే, 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమelizabeth bathori{#}rani;Telugu;Doctor;Stree;nageshwara rao akkineni;Natakam;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;Chitram;Cinema;NTR;nandamuri taraka rama rao;annapurnaఅందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలుఅందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలుelizabeth bathori{#}rani;Telugu;Doctor;Stree;nageshwara rao akkineni;Natakam;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;Chitram;Cinema;NTR;nandamuri taraka rama rao;annapurnaFri, 28 May 2021 10:00:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు విశ్వవిఖ్యాత నట నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను చేశారు వీరిద్దరు. వీరిద్దరిలో కొన్ని సారూప్యాలు మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరు హీరోలు కాకముందు స్టేజి మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే, 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకం లో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్.

దశాబ్దాల తరబడి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వీరిద్దరు రథచక్రాలు గా నిలిచారు. అంతేకాదు వీళ్ళిద్దరూ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ కూడా నేర్పారు. ఆరోగ్య విషయాల తో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిదే. 1932లో మాట నేర్పిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన ఏడేళ్ల అనంతరం రామారావు సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని. ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశం. వీరిద్దరు తమ మొదటి చిత్రాలలో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు.


స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్య లో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలు ఉండడం గమనార్హం. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలు ఉన్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్ర నటులు ఇన్ని సినిమాల్లో  ఇన్ని జానర్ లలో కలిసి నటించలేదు. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన ఏడెకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్ధలు ఏర్పడి దాదాపు ఏడేళ్లు దూరమయ్యారు. అలా దూరం కావడానికి తిరిగి తామిద్దరం దగ్గర కావడానికి కూడా రామారావే కారణమని అక్కినేని చెప్పేవారు. తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఏనాడు బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోవడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!

చిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !

ఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?

కథా నాయకుడా..? మహా నాయకుడా..? ఎన్టీఆర్ ఎవరు..?

లాక్ డౌన్ పొడిగింపు : కేసీఆర్ ఫోన్ సర్వే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>