PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmira55baf82-c022-4c0a-b11a-e77dfe353746-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmira55baf82-c022-4c0a-b11a-e77dfe353746-415x250-IndiaHerald.jpgకాశ్మీర్ ఇప్పటికీ పాకిస్తాన్, భారత్‌ల మధ్య కీలక ప్రాంతంగా ఉన్న విషయం తెలిసిందే. కాశ్మీర్‌పై ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై కాలుదువ్వుతోంది. ఇందులో భాగంగా కాశ్మీర్‌లో అల్లర్లు, బాంబు పేలుళ్లు ఇలా మరెన్నో అరాచకాలకు పాల్పడుతుంది. భారత్‌పై తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఎందరో యువకులను తీవ్రవాదులుగా మార్చింది. వారంతా కాశ్మీర్‌లోనే తలదాచుకుంటూ తమ తీవ్రవాద కార్య కలాపాలను చేసుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం..kashmir{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Pakistan;central government;News;policeకాశ్మీర్‌లోని గ్యాంగ్‌లకు మిలటరీ చెక్.. ప్రాణాలతో 13 మంది..కాశ్మీర్‌లోని గ్యాంగ్‌లకు మిలటరీ చెక్.. ప్రాణాలతో 13 మంది..kashmir{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Pakistan;central government;News;policeFri, 28 May 2021 17:08:37 GMTకాశ్మీర్ ఇప్పటికీ పాకిస్తాన్, భారత్‌ల మధ్య కీలక ప్రాంతంగా ఉన్న విషయం తెలిసిందే. కాశ్మీర్‌పై ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై కాలుదువ్వుతోంది. ఇందులో భాగంగా కాశ్మీర్‌లో అల్లర్లు, బాంబు పేలుళ్లు ఇలా మరెన్నో అరాచకాలకు పాల్పడుతుంది. భారత్‌పై తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఎందరో యువకులను తీవ్రవాదులుగా మార్చింది. వారంతా కాశ్మీర్‌లోనే తలదాచుకుంటూ తమ తీవ్రవాద కార్య కలాపాలను చేసుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం కాశ్మీ‌ర్‌లో ఆర్టికల్ 35ఏ రద్దు తరువాత కాశ్మీర్, లడక్, జమ్ము ప్రాంతాల్లోని తీవ్రవాదుల ఏరివేతను భారత మిలటరీ చేపట్టింది. అందులో భాగంగా అధిక సంఖ్యలో పోలీసు, మిలటరీ అధికారులు ఈ మిషన్‌లో చేరారు.
 

ఇందులో భాగంగా జరిగిన కాల్పుల్లో ఎంతోమంది తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ క్రమంలో మరెందరో తీవ్రవాదులు తమ స్వదేశానికి పారిపోయారు. అయితే అప్పుడప్పుడే తీవ్రవాదంలో అడుగుపెట్టిన కాశ్మీరీ యువతను మిలటరీ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న కాశ్మీరీ యువతకు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. కౌన్సిలింగ్‌లో భాగంగా మరోసారి తీవ్రవాద మనోభావాలను దరిచేరనివ్వొద్దని, దాని వల్ల ఎవ్వరికీ లాభం లేకపోగా మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. వీటితో పాటుగా తీవ్రవాదులు తమ కార్యకలాపాల కోసం దాచిపెట్టుకున్న మందుగుండు సామాగ్రిని అనేక ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి మరిన్ని  చర్యలతో కాశ్మీర్‌లోని తీవ్రవాదాన్ని దాదాపుగా కనుమరుగు చేశారు.



అయితే తాజాగా ఇంకా తీవ్రవాద మనోభావాలతో ఉన్న కొందరు కాశ్మీర్‌లో తమ సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. తమ గ్యాంగ్ ద్వారా భారత్‌లో మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలను విసృతం చేయడం వీరి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు, మిలటరీ వారు చర్యలు చేపట్టారు.  కాశ్మీర్‌లో ప్రారంభం కానున్న తీవ్రవాద గ్యాంగ్‌ను ప్రాణాలతో పట్టుకోవాలని మిలటరీ, పోలీసు అధికారులు ప్లాన్ వేశారు. తమ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు పోలీసులు, మిలటరీ ఎంతో సమన్వయంతో పనిచేసి అవంతిపురా ప్రాంతంలో 13 మంది తీవ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాశ్మీర్‌లో ఇంకెందరు ఇటువంటి చర్యలకు పాల్పడనున్నారో తెలుసుకునేందుకు మిలటరీ వారు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ ముందు షర్మిల స్పాట్ డిమాండ్... సిఎస్ కి లేఖ రాసి మరీ...!

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>