PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishna-ef647d76-e8aa-4992-91e2-2a1823cc5f7a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishna-ef647d76-e8aa-4992-91e2-2a1823cc5f7a-415x250-IndiaHerald.jpgఏపీలో చాలా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పలువురు నాయకులు టీడీపీకి దూరంగా జరిగారు. అలాగే మరికొందరు నాయకులు టీడీపీని వీడి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇంకొందరు నాయకులు రాజకీయాల్లోనే కనిపించడం లేదు. ఇలా నాయకులు హ్యాండ్ ఇచ్చేయడంతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది.balakrishna{#}2019;Parliment;Vishakapatnam;Araku Valley;TDP;Balakrishna;Sri Bharath;bharath;YCP;Anakapalle;anand malayalam actor;Anand Deverakonda;central government;Minister;gummadiబాలయ్య చిన్నల్లుడు లైన్‌లోనే ఉన్నారా? ఆ రెండుచోట్ల సైకిల్‌కు దిక్కు ఎవరు?బాలయ్య చిన్నల్లుడు లైన్‌లోనే ఉన్నారా? ఆ రెండుచోట్ల సైకిల్‌కు దిక్కు ఎవరు?balakrishna{#}2019;Parliment;Vishakapatnam;Araku Valley;TDP;Balakrishna;Sri Bharath;bharath;YCP;Anakapalle;anand malayalam actor;Anand Deverakonda;central government;Minister;gummadiFri, 28 May 2021 14:00:00 GMTఏపీలో చాలా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పలువురు నాయకులు టీడీపీకి దూరంగా జరిగారు. అలాగే మరికొందరు నాయకులు టీడీపీని వీడి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇంకొందరు నాయకులు రాజకీయాల్లోనే కనిపించడం లేదు. ఇలా నాయకులు హ్యాండ్ ఇచ్చేయడంతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది.


ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి సరైన నాయకుడు కనిపించడం లేదు. జిల్లాలో మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అరకు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడుచోట్ల టీడీపీ ఓడిపోయింది. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఓడిపోయాక భరత్ పార్టీ తరుపున యాక్టివ్‌గానే పనిచేశారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల ముందు వరకు పార్టీలో కనిపించారు. అయితే విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ గెలిచింది. ఇక ఎన్నికల ఫలితం తర్వాత భరత్ సైలెంట్ అయిపోయారు.


అటు అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి నాయకుడే లేరు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆడారి ఆనంద్ టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆనంద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆనంద్ వెళ్ళాక, మరో నాయకుడుని పెట్టలేదు. కాకపోతే అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడుగా బుద్ధా నాగజగదీశ్వరరావు పనిచేస్తున్నారు.


ఇక అరకు స్థానంలో టీడీపీ ఉనికే కోల్పోయేలా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన కిషోర్ 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి, అరకులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కిషోర్ రాజకీయాల్లోనే కనిపించడం లేదు. కిషోర్ స్థానంలో మరో నాయకుడుని ఇన్‌చార్జ్‌గా పెట్టలేదు. కానీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. ఈమె 2014లో అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈమె టీడీపీ తరుపున బరిలో ఉండొచ్చు.   




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బింబిసారుడుగా కళ్యాణ్ రామ్..!

బుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !

ఎన్టీఆర్ నటించిన 302 సినిమాలు ఏమేంటో తెలుసా?

సాగునీటి ప్రాజెక్టుల‌పై జ‌గ‌న్‌కు క‌నీస అవ‌గాహ‌న లేదు

క‌థ‌నాయ‌కుడు నుంచి "ప్ర‌జా" నాయ‌కుడిగా... ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం

జబర్దస్త్ నుండి వచ్చి స్టార్ హోదా అందుకున్న కమెడియన్లు వీళ్ళే

ఎన్‌టీఆర్ చేసిన మల్టీస్టారర్ సినిమాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>