PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/puduccheri-cm-rangaswamy94aa3d88-65d0-4350-9941-93d95643da94-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/puduccheri-cm-rangaswamy94aa3d88-65d0-4350-9941-93d95643da94-415x250-IndiaHerald.jpgపుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి చిక్కుల్లో ప‌డ్డారు. సీఎం కుర్చీపై కూర్చ‌న్న ఆనందం కంటే ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితుల‌తో ఆందోళ‌నే ఎక్కువయ్యింది. ముఖ్య‌మంత్రి స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బ‌లం పెర‌గ‌టంతో రంగ‌స్వామికి కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయి. బీజేపీ త‌మ‌కు డిప్యూటీ ముఖ్య‌మంత్రి, డిప్యూటీ స్పీక‌ర్ మ‌రియు రెండు మంత్రి ప‌ద‌వులు కావాలంటూ ప‌ట్టుబడుతోంది. దాంతో పుదుచ్చేరిలో పొలిటిక‌ల్ హీట్ పెరింగింది. రాష్రంలో మొత్తం 30 నియోజ‌క వ‌ర్గాలుండ‌గా...ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రpuduccheri cm rangaswamy{#}Puducherry;CM;Anandam;Bharatiya Janata Party;Minister;Congress;Tamilisai Soundararajan;Chief Minister;Partyచిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !చిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !puduccheri cm rangaswamy{#}Puducherry;CM;Anandam;Bharatiya Janata Party;Minister;Congress;Tamilisai Soundararajan;Chief Minister;PartyFri, 28 May 2021 09:39:01 GMTపుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి చిక్కుల్లో ప‌డ్డారు. సీఎం కుర్చీపై కూర్చ‌న్న ఆనందం కంటే ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితుల‌తో ఆందోళ‌నే ఎక్కువయ్యింది. ముఖ్య‌మంత్రి  స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బ‌లం పెర‌గ‌టంతో రంగ‌స్వామికి కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయి. బీజేపీ త‌మ‌కు డిప్యూటీ ముఖ్య‌మంత్రి, డిప్యూటీ స్పీక‌ర్ మ‌రియు రెండు మంత్రి ప‌ద‌వులు కావాలంటూ ప‌ట్టుబడుతోంది. దాంతో పుదుచ్చేరిలో పొలిటిక‌ల్ హీట్ పెరింగింది. రాష్రంలో మొత్తం 30 నియోజ‌క వ‌ర్గాలుండ‌గా...ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రెస్‌–2, స్వతంత్ర అభ్య‌ర్థులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. దాంతో బీజేపీ మరియు ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ నుండి రంగస్వామి ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నారు. ఆ త‌ర‌వాత క‌రోనా బారిన‌ప‌డ్డ రంగ‌స్వామి ఇటీవ‌లే కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. కాగా బీజేపీ నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు గెల‌వగా మ‌రో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల‌తో క‌లిపి తొమ్మిదిమందికి చేరింది. 

అంతే కాకుండా మ‌రో ముగ్గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కాషాయ పార్టీతో జ‌త‌కట్టారు. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నిర్మల్‌కుమార్, సీనియర్‌ నేత నమశ్శివాయంతో భేటీ అవ్వ‌డం, ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు బీజేపీ బలం ప‌న్నెండుకు చేర‌డంతో త‌మ‌కు డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌రియు ఇత‌ర ప‌ద‌వులు కావాల‌న్న చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబ‌ట్టి బీజేపీకి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తే తాను నామ‌మాత్రం ముఖ్యమంత్రి అవుతార‌న్న ఆందోళ‌న రంగ‌స్వామిలో మొద‌లైంది. మ‌రోవైపు త‌న పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ లోనూ కొంద‌రు ప‌ద‌వుల‌ను ఆశిస్తుండ‌టంతో రంగ‌స్వామికి కొత్త త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతే కాకుండా మిగిలిన‌ ముగ్గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల‌ను మ‌రియు డీఎంకే ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీ సింగిల్ డోస్ టీకాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం..

ఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?

కథా నాయకుడా..? మహా నాయకుడా..? ఎన్టీఆర్ ఎవరు..?

లాక్ డౌన్ పొడిగింపు : కేసీఆర్ ఫోన్ సర్వే

ఎన్టీఆర్ 8 మంది కొడుకులు 4 గురు కూతుళ్లు ఎక్కుడున్నారు..? ఏం చేస్తున్నారు.. ?

పబ్లిక్ ఇష్యూ తో పేటీఎం భారీ మొత్తంలో నగదు సేకరణ?

ఎన్టీఆర్ లేక‌పోయినా ఆయ‌న క్రేజ్‌కు ఇదే సాక్ష్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>