PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-chandrababu-prajala-pranalu-nilabettetamduku278b59ba-012f-4616-8356-973db0a51a73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-chandrababu-prajala-pranalu-nilabettetamduku278b59ba-012f-4616-8356-973db0a51a73-415x250-IndiaHerald.jpgమహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ సర్కార్ తమను ఇబ్బంది పెడుతున్న అంశానికి సంబంధించి చంద్రబాబు కాస్త సీరియస్ గానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి వచ్చే మార్చి నాటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది అని అన్నారు. 1983లో తొలి మహానాడుకు దేశంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాం అని విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 24 గంటలూ ప్రజల కోసమే ఆలోచించాను అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర కనిపిస్తోందిcbn,tdp,ap{#}TDP;CBN;YCP;Telugu Desam Party;March;Hyderabad;Indira Gandhi;Party;NTR;nandamuri taraka rama rao;Shakti;Manamవైసీపీకి వ్యాక్సిన్ అదే... చుక్కలు ఏంటో చూపిస్తా... బాబోరు సీరియస్ సవాల్...!వైసీపీకి వ్యాక్సిన్ అదే... చుక్కలు ఏంటో చూపిస్తా... బాబోరు సీరియస్ సవాల్...!cbn,tdp,ap{#}TDP;CBN;YCP;Telugu Desam Party;March;Hyderabad;Indira Gandhi;Party;NTR;nandamuri taraka rama rao;Shakti;ManamFri, 28 May 2021 18:10:00 GMTమహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ సర్కార్ తమను ఇబ్బంది పెడుతున్న అంశానికి సంబంధించి చంద్రబాబు కాస్త సీరియస్ గానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి వచ్చే మార్చి నాటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది అని అన్నారు. 1983లో తొలి మహానాడుకు దేశంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాం అని విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 24 గంటలూ ప్రజల కోసమే ఆలోచించాను అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర కనిపిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో కూడా అలాంటి స్థానం కోసం అనునిత్యం శ్రమించాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందిరా గాంధీ లాంటి మహామహుల్ని ఎదురొడ్డి నిలబడిన పార్టీ టీడీపీ అని ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వ్యక్తి కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. 70 లక్షల కార్యకర్తలు కలిగిన ఒక శక్తి అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రభుత్వ మితిమీరిన అరాచకాలతో కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు అని విమర్శలు చేసారు.

బెయిల్ రాకుండా ఉండేందుకు.. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే కేసులు పెట్టారు అని మండిపడ్డారు. కేసులకు భయపడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడతామని ఆయన మండిపడ్డారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టినపుడు మనం మనం కూడా ఎదురు కేసు పెడదాం అని సూచించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్.. ఎదురు కేసులే వీరికి వ్యాక్సిన్ అని స్పష్టం చేసారు. చట్టాన్ని సమర్ధవంతంగా వినియోగించి చుక్కలు చూపిస్తా అని ఆయన హెచ్చరించారు. ఈ రోజు నుండి సంవత్సరం పాటు.. పార్టీని బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెడతా అని స్పష్టం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కాన్సెప్ట్ అదేనా.. అలా అయితే బాక్సాఫీస్ బద్దలే?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>