MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr1d705cf4-a3dd-4f2a-ab67-cb28b7b5d9d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr1d705cf4-a3dd-4f2a-ab67-cb28b7b5d9d7-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు తన జీవితంలో ఎన్నో చిలిపి చేష్టలు చేశారని సీనియర్ సినిమా జర్నలిస్టులు చెబుతుంటారు. ఆయన ఒకసారి పాన్ పరాగ్ పలుకులను.. జీడిపప్పు లాగా నోటిలో వేసుకుని ఒక డబ్బా మొత్తం తినేసారట. విశేషమేంటంటే ఆయనకు ఎటువంటి మత్తు రాలేదట. సాధారణంగా పాన్ పరాగ్ ఒక పలుకు నమిలితేనే ఎంతో మత్తు వస్తుంది కానీ అలాంటి పలుకులు వందలకొద్దీ ఒకేసారి నందమూరి తారకరామారావు తిన్నప్పటికీ ఆయనకు ఏమీ కాలేదు. 40 సంవత్సరాల క్రితం పావలా ధరకే కూల్ డ్రింక్ విక్రయించేవారు. అయితే అటువంటి సమయంలోనే " గోల్డ్ కాయిన్ " అని పిలిచే ఆsr-ntr{#}nandamuri taraka rama rao;Cinema;Apple;Director;Darsakudu;Tamil;Telugu;Puttur;NTR;prema;Loveఎన్టీఆర్ చేసిన వింత పనులు ఇవే..?ఎన్టీఆర్ చేసిన వింత పనులు ఇవే..?sr-ntr{#}nandamuri taraka rama rao;Cinema;Apple;Director;Darsakudu;Tamil;Telugu;Puttur;NTR;prema;LoveFri, 28 May 2021 11:00:00 GMTనందమూరి తారక రామారావు తన జీవితంలో ఎన్నో వింత పనులు చేశారని సీనియర్ సినిమా జర్నలిస్టులు చెబుతుంటారు. ఆయన ఒకసారి పాన్ పరాగ్ పలుకులను.. జీడిపప్పు లాగా నోటిలో వేసుకుని ఒక డబ్బా మొత్తం తినేసారట. విశేషమేంటంటే ఆయనకు వీసమెత్తు అయినా మత్తు రాలేదట. సాధారణంగా పాన్ పరాగ్ ఒక పలుకు నమిలితేనే ఎంతో మత్తు వస్తుంది కానీ అలాంటి పలుకులు వందలకొద్దీ ఒకేసారి నందమూరి తారకరామారావు తిన్నప్పటికీ ఆయనకు ఏమీ కాలేదు.

40 సంవత్సరాల క్రితం పావలా ధరకే కూల్ డ్రింక్ విక్రయించేవారు. అయితే అటువంటి సమయంలోనే " గోల్డ్ కాయిన్ " అని పిలిచే ఆపిల్ జ్యూస్ ధర 6 రూపాయలకు పైగా ఉండేది. అయితే 1980లో విశ్వరూపం సినిమాకు సంబంధించిన ఒక పాటని అరుణాచలం స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలో మద్యం తాగుతూ నటించాల్సి ఉంది. అయితే మద్యానికి బదులుగా గోల్డ్ కాయిన్ బాటిల్స్ తాగాలని దర్శకుడు చెప్పడంతో రామారావు సరే అన్నారట. అయితే ఆయన ఈ షూటింగ్ లో మొత్తం 30 గోల్డ్ కాయిన్ బాటిల్స్ తాగేశారట. నిజానికి ఒక్క గోల్డ్ కాయిన్ తాగాలంటే చాలా కష్టమట. గోల్డ్ కాయిన్ బాటిల్స్ లో ఉండే ఆపిల్ జ్యూస్ చాలా వెగటుగా ఉంటుందట. కానీ రామారావు మాత్రం 30 బాటిల్స్ తాగి ఆశ్చర్యపరిచారు.

యుక్త వయస్సు నుంచే రామారావు లో చాలా ఉద్రేకం ఉండేది. ఒక తమిళ వ్యక్తి తెలుగు వాడిని కొట్టాడని తెలుసుకున్న రామారావు కోపోద్రిక్తుడై ఆ తమిళ వ్యక్తిని చితకబాదాడు. నడిరోడ్డుపై ఆయన కొట్టిన కొట్టుడు కి ఆ తమిళ వ్యక్తి కాళ్లా వేళ్లా పడి మరీ బతిమిలాడు కున్నారట. ఆయన ఒక సినిమా కోసం నిజమైన ఎద్దుతో పోరాడుతుంటే చెయ్యి విరిగిందట. అయితే ఆయన అల్లోపతీ వైద్యుల చేత కట్టుకట్టించుకున్నారట. కానీ చెయ్యి కాస్త వంకరగా రావటంతో పుత్తూరు కట్టు కట్టించుకోవాలి అనుకున్న రామారావు వంకరగా ఉన్న చోట వేరో చేతితో గట్టిగా కొట్టి విరగొట్టుకున్నారట. అప్పట్లో ఆయన అంతా మొండిగా ఉండే వారు.

ఇక సినిమా షూటింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ సహనటులను నిజంగానే కొట్టేవారట. ఒకానొక సమయంలో ఆయన కానిస్టేబుల్ పాత్రలో నటించారని.. అప్పుడు రౌడీలని ఆయన లాఠీలతో విపరీతంగా కొట్టారని అంటుంటారు. రామారావు ఆ స్థాయిలో పాత్రల్లో లీనమయ్యే వారట. ఏది ఏమైనా ఎన్టీ రామారావు సామాన్య ప్రజలకు చాలా భిన్నంగా ఉండేవారు. ఆయన సాహిత్యం పై కూడా చాలా ప్రేమ పెంచుకొని మనవరాళ్లకు వింతగా పేర్లు పెట్టారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?

సీనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేసిన 5 సినిమాలు ఇవే..

తెలంగాణ‌లో నేటి నుండి వారికి వ్యాక్సిన్ లు.. !

భర్తకు బ్లాక్ ఫంగస్ సోకిందని.. భార్య చేయకూడని పని చేసింది?

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!

అందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>