MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsipaidipally-e85122c5-b6a3-46c8-8dca-d06b3804bb95-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsipaidipally-e85122c5-b6a3-46c8-8dca-d06b3804bb95-415x250-IndiaHerald.jpg ‘మహర్షి’ సినిమా విడుదలై రెండున్నర సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఒక్క సినిమా కూడ మొదలు పెట్టలేని స్థితిలో వంశీ పైడిపల్లి ఉన్నాడు. మహేష్ ఇచ్చిన షాక్ తో వంశీకి మరో సినిమాను ఫైనల్ చేయడమే చాలా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్దితుల్లో దిల్ రాజ్ వంశీ పైడిపల్లికి చేసిన సహాయాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలను అన్న టెన్షన్ వంశీని వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తమిళ స్టార్ హీరో విజయ్ కు కథ చెప్పి ఒప్పించిన వంశీకి ఇప్పుడు విజయ్ పెట్టిన సరికొత్త పరీక్ష టెన్షన్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న vamsipaidipally;{#}Joseph Vijay;vijay;Cinema;vamsi paidipally;Mahesh;Dil;vamsi;News;Hero;June;Nijamవంశీ పైడిపల్లిని కలవర పెడుతున్న విజయ్ పుట్టినరోజు !వంశీ పైడిపల్లిని కలవర పెడుతున్న విజయ్ పుట్టినరోజు !vamsipaidipally;{#}Joseph Vijay;vijay;Cinema;vamsi paidipally;Mahesh;Dil;vamsi;News;Hero;June;NijamFri, 28 May 2021 10:00:00 GMT
‘మహర్షి’ సినిమా విడుదలై రెండున్నర సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఒక్క సినిమా కూడ మొదలు పెట్టలేని స్థితిలో వంశీ పైడిపల్లి ఉన్నాడు. మహేష్ ఇచ్చిన షాక్ తో వంశీకి మరో సినిమాను ఫైనల్ చేయడమే చాలా కష్టంగా మారింది. ఇలాంటి  పరిస్దితుల్లో దిల్ రాజ్ వంశీ పైడిపల్లికి చేసిన సహాయాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలను అన్న టెన్షన్ వంశీని వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తమిళ స్టార్ హీరో విజయ్ కు కథ చెప్పి ఒప్పించిన వంశీకి ఇప్పుడు  విజయ్ పెట్టిన సరికొత్త పరీక్ష టెన్షన్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లి చెన్నైలో విజయ్ ని కలిసి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వంశీ పైడిపల్లి ఆ స్టోరీ లైన్ ను పూర్తి స్క్రిప్ట్ గా మార్చే పనిలో తన టీమ్ తో చాల బిజీగా ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.


అయితే ఇక్కడ వంశీ పైడిపల్లికి విజయ్ ఒక కండిషన్ పెట్టినట్లు టాక్. జూన్ నెలలో రాబోతున్న తన పుట్టినరోజు లోపుగా ఈ ఫైనల్ స్క్రిప్ట్ తో తన వద్దకు రావాలని విజయ్ పెట్టిన కండిషన్ అంటున్నారు. విజయ్ ఇలాంటి కండిషన్ ఈమధ్య తనకు కథలు చెప్పడానికి వచ్చిన మరికొంతమంది దర్శకులకు పెట్టాడని దీనితో ఆ దర్శకులు అంతా విజయ్ పుట్టినరోజు లోపుగా తమ కథలను ఫైనల్ స్క్రిప్ట్ బౌండ్ లుగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.


విజయ్ జూన్ మొదటి వారంలో తన వద్దకు వచ్చే అన్ని కథల ఫైనల్ స్క్రిప్ట్ లను చూసి ఆ కథలలో తనకు పూర్తిగా నచ్చిన కథకు క్లియరెన్స్ ఇచ్చి విజయ్ జూన్ లో రాబోతున్న తన 47వ పుట్టినరోజునాడు తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తాడు అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే మళ్ళీ వంశీ పైడిపల్లికి అదృష్టం గడప వరకు వచ్చి మళ్ళీ మిస్ అవుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడా..?

అందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలు

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!

చిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !

ఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?

కథా నాయకుడా..? మహా నాయకుడా..? ఎన్టీఆర్ ఎవరు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>