QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaataec615de0-e0ae-48bd-a6f9-f4d6fac15072-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaataec615de0-e0ae-48bd-a6f9-f4d6fac15072-415x250-IndiaHerald.jpgపెద్దలు చెప్పే ఏ మాట అయినా సరే మనం విని తీరాల్సిందే. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్నంగా తెలుసుకొని ఉంటారు. అందుకే వారు చెప్పే ఏ మాట అయినా సరే తప్పకుండా విని తీరాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకు ఉదాహరణగా నేను మీకు ఒక కథను వినిపిస్తాను.. అనగనగా ఒక ఊరి చివర్లో జల జల పారే నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపైన ఒక పక్షి గూడు కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంది. MANNCHIMAATA{#}Manam;Aqua;Airమంచిమాట : పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు..మంచిమాట : పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు..MANNCHIMAATA{#}Manam;Aqua;AirFri, 28 May 2021 14:00:00 GMT
పెద్దలు చెప్పే ఏ మాట అయినా సరే మనం విని తీరాల్సిందే. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్నంగా తెలుసుకొని ఉంటారు. అందుకే వారు చెప్పే ఏ మాట అయినా సరే తప్పకుండా విని తీరాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకు ఉదాహరణగా నేను మీకు ఒక కథను వినిపిస్తాను.. అనగనగా ఒక ఊరి చివర్లో జల జల పారే నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపైన ఒక పక్షి గూడు కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంది.


ఒకరోజు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వేటకు వెళ్లి, తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లల్లో ఒక పిల్ల, గూటి నుండి తల బయటకు పెట్టి ప్రపంచం చూస్తోంది. అంతలో తల్లి పక్షి వచ్చి ఆ పిల్ల పక్షిని కోప్పడింది. ఇంకెప్పుడూ గూటి నుండి బయటకు చూడవద్దు. పొరపాటున చూసావో, క్రింద పడే అవకాశం ఉంది. లేదా మన శత్రువులు ఎవరైనా హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు . మీరు ముగ్గురు పెద్దయ్యాక మనం నలుగురం కలిసి, నాలాగే అందరం బయటకు వెళ్ళవచ్చని ముద్దుగా మందలించింది.

ఇక ఎప్పటిలాగే ఆ తల్లి పక్షి, తన పిల్లలకు ఆహారం తీసుకు రావడానికి బయటకు వెళ్లింది. ఇక ఆ పిల్ల పక్షి, తల్లి పక్షి మాట లెక్కచేయకుండా మరల గూటి అంచు వరకు వచ్చి, బయట వింతలను ఆదమరచి చూస్తోంది. ఇక అనుకోకుండా ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టుతప్పి కాలు జారి నదిలో పడిపోయింది.. ఇక ప్రాణాలని రక్షించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరికి నీటి ఎద్దడికి తట్టుకోలేక నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది.


చూశారు కదా! ఒకవేళ ఆ పిల్ల పక్షి తన తల్లి పక్షి మాట విని ఉంటే, అది ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా! అందుకే పెద్దల మాట వినాలి అని చెప్పేది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య చిన్నల్లుడు లైన్‌లోనే ఉన్నారా? ఆ రెండుచోట్ల సైకిల్‌కు దిక్కు ఎవరు?

బింబిసారుడుగా కళ్యాణ్ రామ్..!

బుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !

ఎన్టీఆర్ నటించిన 302 సినిమాలు ఏమేంటో తెలుసా?

సాగునీటి ప్రాజెక్టుల‌పై జ‌గ‌న్‌కు క‌నీస అవ‌గాహ‌న లేదు

క‌థ‌నాయ‌కుడు నుంచి "ప్ర‌జా" నాయ‌కుడిగా... ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం

జబర్దస్త్ నుండి వచ్చి స్టార్ హోదా అందుకున్న కమెడియన్లు వీళ్ళే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>