PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-chiru30d163a0-029e-4f4c-a9c8-1230d4b6760c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-chiru30d163a0-029e-4f4c-a9c8-1230d4b6760c-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. ఇది చాలా పురాతన డిమాండ్.. తెలుగు దేశం ఎప్పటి నుంచో అడుగుతున్న డిమాండ్.. తెలుగు దేశమే కాదు.. ఎన్టీఆర్ అభిమానులంతా ముక్త కంఠంతో కోరుకునే డిమాండ్. ఆ మాటకొస్తే ప్రతి తెలుగువాడి డిమాండ్ కూడా. భారత్ వచ్చిన వారిలో ఎన్టీఆర్ కంటే స్థాయి తక్కువ వారు చాలా మంది ఉన్నారు కూడా. అలాంటిది.. తెలుగు గడ్డపై చలన చిత్ర, రాజకీయ రంగాల్లో మేరునగధీరుడిగా పేరున్న ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా గళం కలిపారు. ఇవాళ ఎన్టీఆర్ 99 వntr-chiru{#}Telugu Desam Party;Telugu;NTR;nandamuri taraka rama rao;India;Chiranjeevi;Jayanthi;twitter;CBN;Party;prema;Love;venkaiah naiduఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?ఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?ntr-chiru{#}Telugu Desam Party;Telugu;NTR;nandamuri taraka rama rao;India;Chiranjeevi;Jayanthi;twitter;CBN;Party;prema;Love;venkaiah naiduFri, 28 May 2021 09:13:52 GMTఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. ఇది చాలా పురాతన డిమాండ్.. తెలుగు దేశం ఎప్పటి నుంచో అడుగుతున్న డిమాండ్.. తెలుగు దేశమే కాదు.. ఎన్టీఆర్ అభిమానులంతా ముక్త కంఠంతో కోరుకునే డిమాండ్. ఆ మాటకొస్తే ప్రతి తెలుగువాడి డిమాండ్ కూడా. భారత్ వచ్చిన వారిలో ఎన్టీఆర్ కంటే స్థాయి తక్కువ వారు చాలా మంది ఉన్నారు కూడా. అలాంటిది.. తెలుగు గడ్డపై చలన చిత్ర, రాజకీయ రంగాల్లో మేరునగధీరుడిగా పేరున్న ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే.

ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా గళం కలిపారు. ఇవాళ ఎన్టీఆర్ 99 వ జయంతి సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకున్నారు. ఆయన నూరో  జయంతి దగ్గరపడుతున్న వేళ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో భూపేన్ హజారికాకు మరణానంతరం ఇచ్చినట్టు ఎన్టీఆర్‌ కు కూడా మరణానంతరం భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అయితే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ.. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరగలేదన్నది వాస్తవం. గతంలో చంద్రబాబు కేంద్రంలో ప్రధానులను నిర్ణయించే రేంజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ దిశగా ప్రయత్నించలేదు. అప్పుడే చంద్రబాబు తలచుకుని ఉంటే ఎన్టీఆర్‌కు భారత రత్న వచ్చి ఉండేదని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రభ బాగా తగ్గిపోయింది.

ఒకనాడు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం నేడు ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ డిమాండ్‌లను పట్టించుకునేవారు ఎవరుంటారు.. అంతే కాదు.. ఈ డిమాండ్‌లో పెద్దగా చిత్తుశుద్ధి కూడా కనిపించదు. ఏదో ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజు తప్ప ఈ డిమాండ్ గురించి సీరియస్ గా పట్టించుకునేవారే కనిపించరు. అలాంటప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించే దమ్మున్న వారేరీ.. ఎన్టీఆర్‌పై ఎనలేని ప్రేమ కురిపించే ఉప రాష్ట్రపతి వెంకయ్య ఏమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి.

" style="height: 546px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కథా నాయకుడా..? మహా నాయకుడా..? ఎన్టీఆర్ ఎవరు..?

లాక్ డౌన్ పొడిగింపు : కేసీఆర్ ఫోన్ సర్వే

ఎన్టీఆర్ 8 మంది కొడుకులు 4 గురు కూతుళ్లు ఎక్కుడున్నారు..? ఏం చేస్తున్నారు.. ?

పబ్లిక్ ఇష్యూ తో పేటీఎం భారీ మొత్తంలో నగదు సేకరణ?

ఎన్టీఆర్ లేక‌పోయినా ఆయ‌న క్రేజ్‌కు ఇదే సాక్ష్యం

ఈటల దెబ్బకు .. బీజేపీ అబ్బా..?

సీనియర్ ఎన్టీఆర్ ముద్దు పేరు ఏంటో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>