ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald843c5c2-a058-4b65-a896-ec5246194470-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald843c5c2-a058-4b65-a896-ec5246194470-415x250-IndiaHerald.jpgఈ ప్రపంచంలో భర్తని ప్రేమించే భార్య ఉంటుందనేది ఎంత నిజమో భర్తని అవమానించే భార్య కూడా ఉంటుందనేది అంతే నిజం. కొంతమంది మంది భార్యలు అయితే తమ భర్త ఎక్స్ ప్రెషన్స్ నుంచి వారి కదలికల వరకు ప్రతి ఒక్క విషయాన్ని కనిపెడతారు.కొంతమంది భార్యలైతే భర్తపై ఏకంగా నిఘా పెడతారు. చాటుగా ఫోన్లు చెక్ చేయడం, ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడుతుంటే వారి మాట్లాడేది దొంగ చాటుగా వినటం లాంటివి చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా డిటెక్టీవ్ లను కూడా ఏర్పాటు చేస్తారు.దుబాయ్‌కు చెందిన ఓ భార్య కూడా దాదాపు ఈ తతంగమే చేసింది. ఆమే స్వయంగా డిటెక్Viral{#}Smart phone;Wife;Husband;Cheque;Thief;Donga;court;Woman;Lawyer;Athaduతన ఫోన్ చూసినందుకు సొంత భార్యపైనే కేసు పెట్టిన భర్త...తన ఫోన్ చూసినందుకు సొంత భార్యపైనే కేసు పెట్టిన భర్త...Viral{#}Smart phone;Wife;Husband;Cheque;Thief;Donga;court;Woman;Lawyer;AthaduFri, 28 May 2021 23:00:00 GMTఈ ప్రపంచంలో భర్తని ప్రేమించే భార్య ఉంటుందనేది ఎంత నిజమో భర్తని అవమానించే భార్య కూడా ఉంటుందనేది అంతే నిజం. కొంతమంది మంది భార్యలు అయితే తమ భర్త ఎక్స్ ప్రెషన్స్ నుంచి వారి కదలికల వరకు ప్రతి ఒక్క విషయాన్ని కనిపెడతారు.కొంతమంది భార్యలైతే భర్తపై ఏకంగా నిఘా పెడతారు. చాటుగా ఫోన్లు చెక్ చేయడం, ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడుతుంటే వారి మాట్లాడేది దొంగ చాటుగా వినటం లాంటివి చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా డిటెక్టీవ్ లను కూడా ఏర్పాటు చేస్తారు.దుబాయ్‌కు చెందిన ఓ భార్య కూడా దాదాపు ఈ తతంగమే చేసింది. ఆమే స్వయంగా డిటెక్టివ్ అవతారం ఎత్తింది. భర్తకు అనుమానం రాకుండా అతడి ఫోన్లోని ప్రతి డేటాను పరిశీలించేది.


ఫొటోల నుంచి ఫోన్ కాల్ రికార్డుల వరకు ప్రతి ఒక్కటీ అందులో నుంచి సేకరించింది. వాటిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి పరువు మొత్తం తీసింది. దీంతో ఇంట్లో తన కుటుంబ సభ్యుల ముందు తలెత్తుకోలేక భర్త కుమిలిపోయాడు.తన ఫోన్ మీద ఫోకస్ పెట్టి, తన ప్రైవసీకి భంగం కలిగించిందంటూ భార్య మీద కోర్టులో దావా వేశాడు. అంతేగాక, ఈ కేసు కోసం తాను ఆఫీసుకు వెళ్లడం లేదని, దాని వల్ల తాను జీతాన్ని కూడా పోల్పోయానని తెలిపాడు. కాబట్టి తన న్యాయవాదికి చెల్లించాల్సిన మొత్తం కూడా ఆమె ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె చర్యల వల్ల మానసికంగా కుంగిపోయానని తెలిపాడు. తన ఇంట్లో తీవ్ర అవమానానికి గురయ్యానని వాపోయాడు.అతడి వాదన న్యాయమైనదేనని, పైగా ఆమె అతడి ఫొటోలు, రికార్డింగులను సేకరించినట్లు ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆమె తన భర్త ప్రైవసీకి భంగం కలిగించినట్లు కోర్టు భావిస్తోందని న్యాయమూర్తి తెలిపారు.


ప్రతిఫలంగా అతడి భార్య రూ.1 లక్ష జరిమానాతోపాటు అతడి లాయర్ ఖర్చులను కూడా ఆమె భరించాలని తీర్పు ఇచ్చారు. అయితే, ఈ కేసు వల్ల జీతాన్ని కోల్పోయాననే విషయాన్ని మాత్రం తిరస్కరించారు. మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అతడు ఆమెను తీవ్రంగా తిట్టడమే కాకుండా అత్తింటి నుంచి బయటకు గెంటేశాడని తెలిపారు. దీంతో న్యాయమూర్తి తగిన ఆధారాలతో రావాలని తెలిపారు. ఏది ఏమైనా తీర్పు భార్యల చేత బాదింపబడే భర్తల్లో సంతోషాన్ని నింపే అవకాశముంది.కాబట్టి భార్యలు జర జాగ్రత్తగా ఉండండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ విషయంలో బాబుని వదిలేలా లేరుగా!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>