MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5c322151-2683-49c9-b8b2-e4c0e24d01b5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5c322151-2683-49c9-b8b2-e4c0e24d01b5-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం చుట్టూ జనాలని వేసుకుని తిరుగుతూ, బాడీగార్డ్స్‌తో హడావిడిగా ఉంటారు. కానీ ఆ హడావిడి రాజకీయాలకు దూరంగా ఉంటూ, సైలెంట్‌గా తమ పని తాము చేసుకునే వెళ్ళే ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఒకరని చెప్పొచ్చు.ysrcp mla{#}2019;MLA;Party;krishna district;mandalam;YCP;Tiruvuru;TDP;Jagan;Kothapalli Samuel Jawahar;Godavari Riverహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రక్షణనిధిని టీడీపీనే రక్షిస్తుందా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రక్షణనిధిని టీడీపీనే రక్షిస్తుందా?ysrcp mla{#}2019;MLA;Party;krishna district;mandalam;YCP;Tiruvuru;TDP;Jagan;Kothapalli Samuel Jawahar;Godavari RiverFri, 28 May 2021 05:00:00 GMTఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం చుట్టూ జనాలని వేసుకుని తిరుగుతూ, బాడీగార్డ్స్‌తో హడావిడిగా ఉంటారు. కానీ ఆ హడావిడి రాజకీయాలకు దూరంగా ఉంటూ, సైలెంట్‌గా తమ పని తాము చేసుకునే వెళ్ళే ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఒకరని చెప్పొచ్చు.


ఎక్కడా హైలైట్ అవ్వకుండా నియోజకవర్గానికే పరిమితమై ప్రజలకు సేవలు అందిస్తున్న కొక్కిలిగడ్డ...సర్పంచిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 2001-2006 తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం సర్పంచిగా పనిచేయగా, 2006-2011లో పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. ఇక వైసీపీ పార్టీ ఆవిర్భావించాక...ఆ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.


ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆ విధంగా పని చేయడం వల్లే 2019 ఎన్నికల్లో రక్షణనిధి మరోసారి బంపర్ విజయం సాధించారు. ఇక వైసీపీ కూడా అధికారంలోకి రావడం, జగన్ సీఎం అవ్వడంతో, తిరువూరు అభివృద్ధి కోసం రక్షణనిధి కృషి చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పుడు ఏదొక అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నారు.


అలాగే ప్రభుత్వ పథకాలు ఆయనకు ప్లస్ అవుతున్నాయి. కాకపోతే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. అలాగే కొన్ని గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ రక్షణనిధి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కానీ టీడీపీ తరుపున సరైన నాయకులు లేరు.


2019లో టీడీపీ తరుపున ఓడిపోయిన కే‌ఎస్ జవహర్ పశ్చిమ గోదావరి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  ఇక ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. పార్టీని బలోపేతం చేయడం లేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇలా టీడీపీ వీక్ అవ్వడమే రక్షణనిధికి కలిసొస్తుంది. నెక్స్ట్ ఎన్నికల వరకు ఇదే పరిస్తితి ఉంటే రక్షణనిధికి తిరుగుండదు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో చెప్పేందుకు ఆ ఒక్క డైలాగ్‌ చాలు..!

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>