PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/block-fungus--childrencc507759-d76a-4737-bd55-c04451eae47a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/block-fungus--childrencc507759-d76a-4737-bd55-c04451eae47a-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొనసాగిస్తోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇక రాబోయే కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా ఉండబోతోందన్న వార్తలు వినపడుతున్నాయి.BLOCK FUNGUS - CHILDREN{#}Coronavirus;News;Shaktiడేంజర్ బెల్స్: పిల్లలపై బ్లాక్ ఫంగస్ అధిక ప్రభావం చూపనుందా ?డేంజర్ బెల్స్: పిల్లలపై బ్లాక్ ఫంగస్ అధిక ప్రభావం చూపనుందా ?BLOCK FUNGUS - CHILDREN{#}Coronavirus;News;ShaktiThu, 27 May 2021 16:45:33 GMTదేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొనసాగిస్తోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇక రాబోయే కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా ఉండబోతోందన్న వార్తలు వినపడుతున్నాయి. మొదటి దశలో వృద్ధులను టార్గెట్ చేసిన వైరస్ రెండవ దశలో యువకులను సైతం ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు రాబోయే మూడోవ దశలో కరోనా ప్రభావం పిల్లల పై ఉండబోతోందని కొందరు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అంతకంతకూ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ సైతం కరోనా మూడవ దశ విజృంభించే సమయంలో పిల్లలను ఎక్కువగా ఎటాక్ చేయబోతోందని కొందరు అంటున్నారు.

బ్లాక్ ఫంగస్ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇక ఇది పిల్లలకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అన్న విషయానికొస్తే, ప్రముఖ వైద్య నిపుణులు కొన్ని అంశాలను చెబుతున్నారు.  బ్లాక్ ఫంగస్ అనేది ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య.  మనుషులకు చాలా అరుదుగా సోకుతుంది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశముందని చెబుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ సాధారణ ప్రజలకు సోకిన దాఖలాలు లేవని, కేవలం కరోనా నుండి కోలుకున్న వారికి,  ముఖ్యంగా చూస్తే డయాబెటిక్ పేషంట్స్ కు, స్టెరాయిడ్స్ ను ఎక్కువగా వినియోగించే వారిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యయనాలు మరియు పరిశోధనలు  ద్వారా కొందరు వైద్య నిపుణులు వెల్లడించారు.

అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చిన్నారులకు సోకే ప్రమాదం తక్కువ అని చెబుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఒకవేళ చిన్నారుల్లో కనుక బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించినట్లయితే ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా పీడియాట్రిక్ డాక్టరును సంప్రదించాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే ముందు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు తగిన పోషక ఆహారాన్ని అందించాలి. రెండు ఏళ్ళు పైబడిన పిల్లలకు మాస్కు తప్పనిసరిగా అలవాటు చేయాలి. వీలైనంత వరకు బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది అని చెబుతున్నారు. కాబట్టి కరోనా మూడవ దశలో పిల్లలపై బ్లాక్ ఫంగస్ ప్రభావం పెద్దగా ఉండబోదని అయినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>