LifeStyleN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pawan-kalyanda3767ea-9d3d-4807-9f90-1b78c0f4ff7a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pawan-kalyanda3767ea-9d3d-4807-9f90-1b78c0f4ff7a-415x250-IndiaHerald.jpgక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న సేవా దృక్ప‌థంతో ఆయ‌న అభిమానులు కూడా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది క‌రోనా మొద‌టి ద‌శ‌లో లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారికి అండ‌గా ఉంటూ వారికి ఆర్థికసాయం,నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందించారు.ఇత‌ర రాష్ట్రాల‌కు కాలిన‌డ‌క‌న వెళ్లే వ‌ల‌స కూలీల‌కు భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు.గ‌త రెండు నెల‌లుగా క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తుంది.ప్ర‌తిరోజు 20వేల‌కు పైగా కpawan-kalyan{#}House;District;Balakrishna;Party;Serviceజ‌న‌సేనాని స్ఫూర్తితో "జ‌న‌సేవ‌"జ‌న‌సేనాని స్ఫూర్తితో "జ‌న‌సేవ‌"pawan-kalyan{#}House;District;Balakrishna;Party;ServiceThu, 27 May 2021 16:08:57 GMTక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న సేవా దృక్ప‌థంతో ఆయ‌న అభిమానులు కూడా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది క‌రోనా మొద‌టి ద‌శ‌లో లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారికి అండ‌గా ఉంటూ వారికి ఆర్థికసాయం,నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందించారు.ఇత‌ర రాష్ట్రాల‌కు కాలిన‌డ‌క‌న వెళ్లే వ‌ల‌స కూలీల‌కు భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు.గ‌త రెండు నెల‌లుగా క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తుంది.ప్ర‌తిరోజు 20వేల‌కు పైగా కేసులు న‌మోదైయ్యాయి.ఇటు మ‌ర‌ణాలు కూడా ఈ ద‌శ‌లో ఎక్కువ‌గా న‌మోదైయ్యాయి.ఆక్సిజ‌న్ కొర‌త‌తో చాలా మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.క‌రోనా బాధితుల‌కు అండ‌గా కోవిడ్ సెంక‌డ్ వేవ్‌లో కూడా జ‌న‌సైనికులు ముందుకు వ‌చ్చారు.ఏపీలోని ప్ర‌తిజిల్లాలో జ‌న‌సేనికులు త‌మవంతుగా ఎంతోకొంత సాయం చేస్తున్నారు.నెల్లూరు జిల్లాలో గ‌త 10 రోజులుగా హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటున్న వారికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు జ‌న‌సైనికులు ఆహారం అందిస్తున్నారు.
తూర్పోగోదావ‌రి జిల్లా రాజోలు మండ‌లం చింత‌ల‌ప‌ల్లిలో క‌రోనా బారినప‌డిన కుటుంబాల‌కు నిత్వ‌స‌ర‌వ‌స్తువులు,పండ్లు,మాస్కులు అందించి వారికి ధైర్యాన్ని చెప్పారు.రాజ‌మండ్రి,అన‌ప‌ర్తి,కాకినాడ ప్రాంతాల్లో ఐదురోజులుగా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపిణీ చేశారు.ముమ్మిడివ‌రం నియోజక‌వ‌ర్గంలో దాత‌ల స‌హాయంతో జ‌న‌సేన రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ క‌రోనా బాధితుల‌కు 15 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందించారు.కృష్ణాజిల్లాలో పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం నాయకులు య‌డ్ల‌ప‌ల్లి రామ్‌సుధీర్ క‌రోనా బాధితుల‌కు త‌మవంతు సాయంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందిస్తున్నారు.మ‌రోవైపు దాత‌ల సాయంతో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు,మాస్క‌లు,శానిటైజ‌ర్లు,టాబ్లెట్స్‌ని క‌రోనా బాధితుల‌కు జ‌న‌సైనికులు అందిస్తున్నారు. ఇటు పార్టీ పరంగా కాకుండా మోగా అభిమాన సంఘాల ఆధ్వ‌ర్యంలో కూడా వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.మెగా ఫ్యామిలీ అభిమాన సంఘం నుంచి కూడా బాధితుల‌కు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు,ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందిస్తున్నారు.విప‌త్క‌ర స‌మ‌యంలో ఎవ‌రికి ఎలాంటి ఆప‌ద‌వ‌చ్చినా తామున్నామంటూ ముందుకు వ‌స్తున్నారు జ‌న‌సైనికులు.జ‌న‌సేనాని స్ఫూర్తితో ఎప్పుడూ జ‌నం కోసం సేవ చేస్తామ‌ని జ‌న‌సైనికులు అంటున్నారు.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?

సర్దుకుంటున్న టక్ జగదీశ్!

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>