SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality6d51923a-7c26-450e-b7fe-1a1f80a2926d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality6d51923a-7c26-450e-b7fe-1a1f80a2926d-415x250-IndiaHerald.jpgజంతువులు మరియు పక్షులు హిందూ సంప్రదాయంతో ఎంతో ముడిపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. పలు జంతువులు మన దేవతల వాహనాలుగా చెప్పబడుతున్నాయి. వినాయకునికి ఎలుక, సుబ్రమణ్య స్వామి కి నంది, శనేశ్వరునికి కాకి ఇలా పలు దేవుళ్లకు పక్షులు, జంతువులు వాహనాలుగా మన పురాణాల్లో పరిగణించబడింది.SPIRITUALITY;deva;jeevitha rajaseskhar;manu;tara;tiru;vaali;vehicles;hindusశనీశ్వరుని వాహనం "కాకి" చేస్తున్న ఈ పనులకు అర్ధమిదే ?శనీశ్వరుని వాహనం "కాకి" చేస్తున్న ఈ పనులకు అర్ధమిదే ?SPIRITUALITY;deva;jeevitha rajaseskhar;manu;tara;tiru;vaali;vehicles;hindusThu, 27 May 2021 08:00:00 GMTజంతువులు మరియు పక్షులు హిందూ సంప్రదాయంతో ఎంతో ముడిపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. పలు జంతువులు మన దేవతల వాహనాలుగా చెప్పబడుతున్నాయి. వినాయకునికి ఎలుక, సుబ్రమణ్య స్వామి కి నంది, శనేశ్వరునికి కాకి ఇలా పలు దేవుళ్లకు పక్షులు, జంతువులు వాహనాలుగా మన పురాణాల్లో పరిగణించబడింది. అయితే పక్షుల్లో కాకి మన హిందువుల సంప్రదాయానికి కొంత ఎక్కువ గానే ముడిపడి ఉంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారని విశ్వసిస్తారు. మనిషి జీవితం మరణం కాకితో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు.

ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరుస్తుంటే దానికి కూడా కొన్ని కారణాలు చెప్పబడ్డాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కనుక కాకి ఇంటి ముందు వాలి పెద్దగా అరుస్తుంటే మీరు వెళ్ళే పని   విజయవంతంగా పూర్తవుతుందని అర్థం. ఆహారాన్ని తీసుకెళుతున్న కాకి ఆ ఆహారాన్ని మనిషిపై పడేస్తే, ఆ వ్యక్తికి ప్రమాదం పొంచి ఉన్నట్లు సూచన. నిండుగా ఉన్న కుండపై లేదా నీళ్ళు నిండుగా ఉన్న వస్తువుపై కాకి కూర్చోవడం మనిషి చూస్తే, ఆ వ్యక్తి త్వరలో ధనవంతులు అవుతారని అర్థం. కాకి కనుక పదే పదే మన దృష్టిని ఆకర్షించేలా అరుస్తుంటే మన ఇంటికి బంధువులు రాబోతున్నట్లు సంకేతం.

ఒకవేళ కాకి మనిషి తలపై తాకినా లేదా తన్నినా ఆ వ్యక్తి  త్వరలో అనారోగ్య పాలవుతారని అర్థం. ఒకవేళ కాకి రెక్కలు విప్పి ఆడిస్తూ తిరుగుతూ మీ ముందు కానీ, ఇంటి ముందు కానీ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎవరో మారాణించబోతున్నారని సంకేతం. ఇలా కాకి జరగబోయే విషయాలను మనుషులకు తెలియజేసేందుకు పలు సంకేతాలను అందజేస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు. ఇవి కేవలం గతంలో పూర్వీకులు వారి పరిస్థితులను బట్టి చెప్పబడినవి మాత్రమే. ఈ విషయాలను నమ్మొచ్చా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బే కరోననా.. చాన్సే లేదు?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>