PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court6414e2bc-6467-47d3-a9c4-a0a80f4f52f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court6414e2bc-6467-47d3-a9c4-a0a80f4f52f3-415x250-IndiaHerald.jpgబెంగాల్ నారద కేసు ప్రస్తుతం దేశమంతటా చర్చనీ యాంశం అయింది. ఈ కేసు నేపథ్యంలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకులను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఈకేసు ఎన్నికల ముందు నుంచే నడుస్తోంది. అయితే ఎన్నికల్లో పాల్గొని గెలిచిన వారిని కూడా విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారిని విచారించేందుకు..supreme court{#}West Bengal - Kolkata;Party;Supreme Court;Mamta Mohandas;CBI;Sambandamమమత పై కేసు.. మీరే బాసు..సీబీఐకి సుప్రీం ఆదేశాలు..మమత పై కేసు.. మీరే బాసు..సీబీఐకి సుప్రీం ఆదేశాలు..supreme court{#}West Bengal - Kolkata;Party;Supreme Court;Mamta Mohandas;CBI;SambandamThu, 27 May 2021 11:25:00 GMTబెంగాల్ నారద కేసు ప్రస్తుతం దేశమంతటా చర్చనీ యాంశం అయింది. ఈ కేసు నేపథ్యంలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకులను అరెస్టు చేయాల్సి వచ్చింది.  ఈకేసు ఎన్నికల ముందు నుంచే నడుస్తోంది. అయితే ఎన్నికల్లో పాల్గొని గెలిచిన వారిని కూడా విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారిని విచారించేందుకు కావలసిన అన్ని అధికారాలను సీబీఐకు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకు స్వయంగా మమతా బెనర్జీనే బరిలోకి దిగారు. వారిని విచారణ కోసం తీసుకెళ్లేందుకు వచ్చిన సిబీఐపై దీదీ నిరసనకు దిగారు.


ఈ నిరసన దాదాపు 6 గంటల సమయం కొనసాగింది. దాంతో సీబీఐ వెనకడుగు వేసింది. ఈ మేరకు మమతా బెనర్జీపై కూడా చర్య తీసుకువాల్సి వస్తుందంటూ సుప్రీంకు  సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీం ఈ కేసు విచారణలో భాగంగా  మమతా బెనర్జీపై కేసు నమోదు చేసినా తాము అడ్డగించమని, ఆమెపై కేసు విషయంలో అధికారాలను మీకే ఇస్తున్నానంటూ ప్రకటించింది. అంతేకాకుండా న్యాయ విచారణకు అడ్డు వచ్చిన ఎవరిపై అయినా కేసును నమోదు చేయమని, ఇటువంటి అన్యాయ చర్యలను సహించకూడదని సుప్రీం తెలిపింది. మరి ఈ విషయంలో సీబీఐ ఏం చేస్తుందనేది తెలియాల్సి ఉంది.


అయితే నారద కేసు విషయంలో ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసులో దీదీ హస్తం కూడా ఉండబట్టే తన పార్టీ నేతలను కాపాడుకునేందుకు దీదీనే స్వయంగా రంగంలోకి దిగారని, సుప్రీం కోర్టు, సీబీఐలను సైతం ప్రతిఘటించేందుకు కూడా సిద్దమయ్యారని సందేహాలు వస్తున్నాయి. ఈ నారద కేసు విషయంలో తన పార్టీ నేతలు నోళ్లు విప్పితే తన పేరు బయటకు వస్తుందని, దాని కారణంగా తన అధికారం చేజారుతందన్న ఆలోచనతోనే దీదీ ఇలాంటి చర్చలు చేపడుతున్నారని కొందరు అంటున్నారు. ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నారద కేసుతో సంబంధం ఉన్నట్లు తేలినా తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకు దీదీ ఈ తెగింపు చర్యలు చేపట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ కేసు విషయంలో మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేస్టేజ్‌లో ఆ రాష్ట్రాలే టాప్.. కారణం అదేనా..

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?

2014 ఎన్నికల్లో ఆ విషయంలో పవన్ టాప్ తెలుసా?

వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?

పీఎం మోడీ @ 7



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>