MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు బాలయ్య. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సినిమాలకు బాలయ్య కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచారు. balayya;ntr;balakrishna;jayanthi;deva;krishna;nandamuri mokshagna teja;ramu;nandamuri balakrishna;hero;nandamuri taraka rama rao;jayamఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!balayya;ntr;balakrishna;jayanthi;deva;krishna;nandamuri mokshagna teja;ramu;nandamuri balakrishna;hero;nandamuri taraka rama rao;jayamThu, 27 May 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు  బాలయ్య. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సినిమాలకు బాలయ్య కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్మాల్ సర్ప్రైజ్ అంటూ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే అఖండ సినిమాలో నటిస్తున్న బాలయ్య సర్ప్రైజ్ అంటూ ప్రకటన చేయడంతో ఆ సర్ప్రైజ్ ఏమిటా..? అని బాలయ్య ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని సమాచారం అందుతోంది. సీనియర్ ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని ఈరోజు ఉదయం అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ గానం చేసిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది.

ఇక సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో చాలా సినిమాల్లో రాముడి గెటప్ లో నటించిన సంగతి అందరికి తెలిసిందే. పౌరాణికంలో సినిమాలకు ఎన్టీఆర్ కి సాటి ఎవరు లేరు. నిజమైన దేవుళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు.. కానీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి అబ్బినట్టుగా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు ఎవరికీ అంతగా సెట్ కాదేమో అనిపిస్తుంది.అయితే సీనియర్ ఎన్టీఆర్ రాముని పాత్రల బొమ్మలకు బాలయ్య గాత్రంతో వీడియో రిలీజ్ కానుందని నందమూరి ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ సర్పైజ్ ఉండబోతుందని తెలుస్తోంది.

కాగా, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి, అఖండ రిలీజ్ డేట్ గురించి, బాలయ్య కొత్త సినిమాల గురించి ప్రకటనలు వెలువడితే బాగుంటుందని భావిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాకపోయినా వచ్చే నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ లను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతుండటం గమనార్హం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాందేవ్ బాబా పై బీహార్ బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కాటసానికి బీసీతో ఇబ్బందేనా?

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>