MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitharaa512eef5-7c73-4a4e-b305-c2ee9e8fec16-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitharaa512eef5-7c73-4a4e-b305-c2ee9e8fec16-415x250-IndiaHerald.jpgనిన్నటి తరం హీరోయిన్ లు రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. దర్శక నిర్మాతలు ఏరికోరి మరి హీరోయిన్ గా రిటైర్ అయిన కొంతమంది కథానాయికలను తీసుకువచ్చి మరి తమ సినిమాల్లో నటింపచేస్తున్నారు. దాంతో వారికి మంచి గౌరవంతో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా అందుతుంది. అయితే చాలామంది పాత తరం హీరోయిన్ లు రీఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ కూడా పోటీ బాగా పెరిగిపోయింది. అవకాశాలు తమ వరకు రావడం తక్కువ అయిపోయాయి. ఈ కారణంగానే కొంతమంది సీనియర్ నటీమణులకు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ వచ్చిన హీరోయిన్ లను ఇప్పుడు చూద్దాsithara{#}Heroine;sithara;Cinema;AdiNarayanaReddy;Kumaar;gouthami;aishwarya;Oh Babyరీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్లు.. ఎక్కడ ఉన్నారు.. ?రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్లు.. ఎక్కడ ఉన్నారు.. ?sithara{#}Heroine;sithara;Cinema;AdiNarayanaReddy;Kumaar;gouthami;aishwarya;Oh BabyThu, 27 May 2021 15:00:00 GMTనిన్నటి తరం హీరోయిన్ లు రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. దర్శక నిర్మాతలు ఏరికోరి మరి హీరోయిన్ గా రిటైర్ అయిన కొంతమంది కథానాయికలను తీసుకువచ్చి మరి తమ సినిమాల్లో నటింపచేస్తున్నారు. దాంతో వారికి మంచి గౌరవంతో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా అందుతుంది. అయితే చాలామంది పాత తరం హీరోయిన్ లు రీఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ కూడా పోటీ బాగా పెరిగిపోయింది. అవకాశాలు తమ వరకు రావడం తక్కువ అయిపోయాయి. ఈ కారణంగానే కొంతమంది సీనియర్ నటీమణులకు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ వచ్చిన హీరోయిన్ లను ఇప్పుడు చూద్దాం.

మొదటి నుంచి కూడా పద్ధతి కి చీర కట్టినట్టుగా కనిపించే సితార లెజెండ్ సినిమా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. అలా వరుసగా ఆమె యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేస్తూ వచ్చారు. ఆది సాయి కుమార్ జోడి సినిమా తర్వాత మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 6 ఏళ్ళ పాటు కొనసాగిన తర్వాత ఆమెకు అవకాశాలు కాస్త పలచబడి నట్లు గా అనిపిస్తోంది. కథానాయికగా మత్తు కళ్ళతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన నిరోషా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన జోరు చూపించలేకపోయారు. ఒకటి రెండు సినిమాల తర్వాత ఆమె కనిపించకుండా పోయారు.

ఇక ఐశ్వర్య, గౌతమి పరిస్థితి కూడా అంతే.. మామగారు, బ్రహ్మ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య అడపాదడపా మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ వస్తున్నారు. దేవదాసు, ఓ బేబీ తర్వాత ఆమె స్పీడ్ కూడా కాస్త తగినట్లుగానే కనిపిస్తోంది. నాజూకు హీరోయిన్ గా ఒకప్పుడు మంచి మార్కులు కొట్టేసిన గౌతమి మనసంతా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. తన గ్లామర్ ఎంత మాత్రం తగ్గలేదని అనిపించుకున్నారు. డీసెంట్ గా కనిపించే పాత్రలలో బిజీ అవుతారని అభిమానులు అనుకున్నారు. కానీ ఆమె కూడా ఆ సినిమా తర్వాత తెరపై కనిపించడం లేదు. అప్పటి హీరోయిన్ ల రాక ఎక్కువైపోతుండడంతో వీరికి అవకాశాలు సన్నగిల్లాయి అని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?

సర్దుకుంటున్న టక్ జగదీశ్!

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

భారత సైన్యంలోకి స్పైడర్..

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>