ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/politics_latestnews/viral-video-twitter-moniter-lizard0199d693-b804-430c-8714-52b6231d299c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/politics_latestnews/viral-video-twitter-moniter-lizard0199d693-b804-430c-8714-52b6231d299c-415x250-IndiaHerald.jpgమొన్న‌టి దాకా తౌక్టే తుఫాను ఎంత బీభ‌త్సం సృష్టించిందో చూశాం. ఇప్పుడు అది త‌గ్గిందో లేదో మ‌రో తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడ్డ యాస్ తుఫాన్ ప్ర‌ళ‌య భీక‌రంగ మారింది. దీని దెబ్బ‌కు తీర ప్రాంతాల‌న్నీ గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీటితో మునిగిపోయాయి. ప‌ట్ట‌ణాలన్నీ నీటితో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే ఇలాంటి అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఓ విచిత్రం జ‌రిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చెక్క‌ర్లు కొడుతోంది. అందులో ఓ మానిటర్ బల్లి రోడ్డుపై తిరుగుతూ కనిపించviral video, twitter, moniter lizard{#}West Bengal - Kolkata;praveen;Odishaఇళ్ల‌లోకి వ‌చ్చిన మానిట‌ర్ బ‌ల్లి.. ఎక్క‌డో తెలుసా?ఇళ్ల‌లోకి వ‌చ్చిన మానిట‌ర్ బ‌ల్లి.. ఎక్క‌డో తెలుసా?viral video, twitter, moniter lizard{#}West Bengal - Kolkata;praveen;OdishaThu, 27 May 2021 18:00:00 GMTమొన్న‌టి దాకా తౌక్టే తుఫాను ఎంత బీభ‌త్సం సృష్టించిందో చూశాం. ఇప్పుడు అది త‌గ్గిందో లేదో మ‌రో తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడ్డ యాస్ తుఫాన్ ప్ర‌ళ‌య భీక‌రంగ మారింది. దీని దెబ్బ‌కు తీర ప్రాంతాల‌న్నీ గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీటితో మునిగిపోయాయి. ప‌ట్ట‌ణాలన్నీ నీటితో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

అయితే ఇలాంటి అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఓ విచిత్రం జ‌రిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చెక్క‌ర్లు కొడుతోంది. అందులో ఓ మానిటర్ బల్లి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. తుఫాన్ దాటికి పలు ప్రాంతాలు నీట మునగడంతో సముద్రంలోని మొసళ్లు, మానిటర్‌ బల్లులు వరదల్లో ఇళ్ల ముందుకు కొట్టుకొచ్చాయి. వీధుల్లో తిరుగుతూ జ‌నాల‌ను భ‌య బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి.

తాజాగా కోల్‌కతా నగరంలోని దమ్‌ దమ్‌ ఏరియాలో ఓ వీధిలో మానిటర్‌ బల్లి తిరుగుతూ కనిపించింది. ఈ మానిటర్‌ బల్లి అతి భ‌యంక‌రంగా అచ్చం మొసలి లాగే ఉంది. నీటిలో క‌ద‌లాడుతూ అంద‌రినీ చాలా సేపు వ‌ణికించింది. ఇదొక్క‌టే కాదు మొసళ్లు కూడా వరద నీటిలో అటుఇటు తిరుగుతూ క‌నిపించాయి. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు భయాందోళనకు గురవుతున్నారు.

అందులో కొంద‌రు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా తెగ వైర‌ల్ అవుతున్నాయి. మానిట‌ర్ బ‌ల్లి సంచ‌రిస్తున్న వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ అంగుసామీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా విప‌రీతంగా వైరల్ అయింది. దీంతో స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకుని, ఓ మానిటర్‌ బల్లితో పాటు ఓ మొసలిని పట్టుకున్నారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను కార‌ణంగా స‌ముద్రంలోని జంతువులు ఇలా ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయని అక్క‌డి అధికారులు చెబుతున్నారు. ఎక్క‌డైనా ఎలాంటి ప్రాబ్ల‌మ్ వచ్చినా త‌మ‌కు తెలియ‌జేయాల‌ని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం యాస్ తుఫాన్ ఒడిశా మీదుగా వీస్తోంది.


" style="height: 836px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పూరి - గోపీచంద్ యాక్షన్ సినిమాకు 11ఏళ్ళు..!

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>