PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababua3a6a44a-fe57-4ca4-97dc-68b0cf30d61a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababua3a6a44a-fe57-4ca4-97dc-68b0cf30d61a-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్ గా వరుసగా రెండో ఏడాది జరుగుతుంది. ఇందులో కరోనా వాక్సిన్ పై చర్చలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యాక్సిన్ కు రూ.1600కోట్లు ఖర్చు చేయకుండా మీనమేషాలు లెక్కించటం వల్లే కొంపలు కూలుతున్నాయి అని అన్నారు. కలలో కూడా ఊహించని సంక్షోభం కరోనా రూపంలో వచ్చినందున బాధితులకు బాసటగా ఉంటూ సమాజానికి అండగా నిలవాలి అని ఆయన పార్టీ నేతలకు సూచించారు. సమాజహితం కోసం ఉచితంగా వైద్యం చేస్తానంటున్న ఆనందయ్యను హింసించటం దారుణం అని మండిపడ్డారు. తమిళనాడులో మౌలిక cbn,tdp,ap{#}CBN;Telugu Desam Party;TDP;Party;udhayanidhi stalin;Stalin;Government;chakravarthy;Doctor;Scheduled Tribes;local language;Jaganఎబిఎన్ కు అండగా బాబు వ్యాఖ్యలు...!ఎబిఎన్ కు అండగా బాబు వ్యాఖ్యలు...!cbn,tdp,ap{#}CBN;Telugu Desam Party;TDP;Party;udhayanidhi stalin;Stalin;Government;chakravarthy;Doctor;Scheduled Tribes;local language;JaganThu, 27 May 2021 17:10:00 GMTతెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్ గా వరుసగా రెండో ఏడాది జరుగుతుంది. ఇందులో కరోనా వాక్సిన్ పై చర్చలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యాక్సిన్ కు రూ.1600కోట్లు ఖర్చు చేయకుండా మీనమేషాలు లెక్కించటం వల్లే కొంపలు కూలుతున్నాయి అని అన్నారు. కలలో కూడా ఊహించని సంక్షోభం కరోనా రూపంలో వచ్చినందున బాధితులకు బాసటగా ఉంటూ సమాజానికి అండగా నిలవాలి అని ఆయన పార్టీ నేతలకు సూచించారు. సమాజహితం కోసం ఉచితంగా వైద్యం చేస్తానంటున్న ఆనందయ్యను హింసించటం దారుణం అని మండిపడ్డారు.

తమిళనాడులో మౌలిక సదుపాయాలున్నా యుద్ధప్రాతిపదికన మరో 3వేల పడకల ఏర్పాటుకు స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు అని వెల్లడించారు. మీరు వ్యాక్సిన్ ఇవ్వకపోగా ప్రైవేటు పరంగాను ఇవ్వకుండా అనవసరంగా అడ్డుకుంటున్నారు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వం చేయకపోగా చేసే వారిని చేయనివ్వకపోవటం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే పరిస్థితి తెస్తున్నారు అని విమర్శించారు. ఎంతమందికి వ్యాక్సిన్ ఆర్డర్ పెట్టారు, ఎప్పుడు వేస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వాలి అని ఆయన అన్నారు.

రోమ్ నగరం తగలపడుతుంటే చక్రవర్తి వ్యవహరించిన రీతిలో ప్యాలెస్ లో కూర్చుని ఆనందిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపారు అని ఆయన ఆరోపించారు. మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. నా ఇంటికి తాళ్లు కట్టడం దగ్గర నుంచి విశాఖలో నన్ను వెనక్కి పంపే వరకు ఇష్టానుసారంగా వ్యవహరించారని స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం తీర్పును అర్థం చేసుకోలేదంటే ఆమె ఈ పదవికి అర్హురాలా కాదా అనేది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. దేశద్రోహం కేసులు పెడుతున్నారు అని విమర్శించారు. కరోనాకు వ్యాక్సిన్ ఏవిధంగా పరిష్కారం చూపుతోందో.. జగన్ రెడ్డి అప్రజాస్వామికి విధానాలకు కూడా శిక్ష పడాలని వ్యాఖ్యానించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>