MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-87ca974d-13d3-49dd-9c4e-820271768bdf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-87ca974d-13d3-49dd-9c4e-820271768bdf-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మొన్నటి వకీల్ సాబ్ వరకు ప్రతి ఒక్క సినిమాతో హీరోగా తన క్రేజ్, పాపులారిటీ అమాంతం పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక పవన్ కెరీర్ లో అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా ఖుషిని చెప్పవచ్చు. అంతకముందు ఆరు సినిమాలు చేసిన పవన్, ఏడవ సినిమాగా విడుదలైన ఖుషి సక్సెస్ తో హీరోగా భారీ స్థాయి క్రేజ్, మార్కెట్ ని దక్కించుకున్నారు. ఎస్ జె సూర్య ఎంతో అద్భుతంగా తీసిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. Pawan-Kalyan{#}Cinema;Pawan Kalyan;kalyan;Girl;PAWAN;kushi;vegetable market;s j surya;Bhumika Chawla;Pawan-Kalyan;johnny;Johnny1;geetha;Allu Aravind;renu desai;ramana gogula;Father;Kick;Successపవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!Pawan-Kalyan{#}Cinema;Pawan Kalyan;kalyan;Girl;PAWAN;kushi;vegetable market;s j surya;Bhumika Chawla;Pawan-Kalyan;johnny;Johnny1;geetha;Allu Aravind;renu desai;ramana gogula;Father;Kick;SuccessThu, 27 May 2021 17:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మొన్నటి వకీల్ సాబ్ వరకు ప్రతి ఒక్క సినిమాతో హీరోగా తన క్రేజ్, పాపులారిటీ అమాంతం పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక పవన్ కెరీర్ లో అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా ఖుషిని చెప్పవచ్చు. అంతకముందు ఆరు సినిమాలు చేసిన పవన్, ఏడవ సినిమాగా విడుదలైన ఖుషి సక్సెస్ తో హీరోగా భారీ స్థాయి క్రేజ్, మార్కెట్ ని దక్కించుకున్నారు. ఎస్ జె సూర్య ఎంతో అద్భుతంగా తీసిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా తరువాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని జానీ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు. తొలిసారిగా పవర్ స్టార్ మెగాఫోన్ పట్టిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది. రమణ గోగుల మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నేర్పే కోచ్ గా పవర్ స్టార్ నటించారు. అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన జానీ, ఆ తరువాత తండ్రి మరొక ఆమెని వివాహం చేసుకోవడంతో తల్లి ప్రేమకు దూరమవుతాడు.

ఇక తాను అమితంగా ప్రేమించిన గీత కు లుకేమియా వ్యాధి సోకడంతో, ఆమెను బ్రతికించుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ లో పాలోనే జానీ, చివరికి ఆ పోటీలో డబ్బు గెలిచి గీతకు వైద్యం చేయించి బ్రతికించుకుంటడు. కథ పరంగా బాగున్నప్పటికీ దీనిని తెరపై ఆకట్టుకునేలా తీయడంలో పవన్ విఫలం అయ్యారు. కాగా ఈ సినిమా పరాజయం పాలయినప్పటికీ మూవీకి రమణ గోగుల అందించిన సాంగ్స్ తో పాటు పవన్ చేసిన ఫైట్స్, యాక్షన్ ప్రేక్షకాభిమానులను ఎంతో అలరించాయి. వాస్తవానికి ఖుషి తో భారీ ఇమేజ్ దక్కించుకున్న పవన్, ఈ మూవీ తో కూడా సక్సెస్ కొట్టి ఉంటే ఆయనకు మరింతగా పేరు దక్కి ఉండేది. ఆ విధంగా జానీ మూవీ పవన్ కెరీర్ కి అప్పట్లో బాగా దెబ్బేసింది...... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజ‌య‌వంత‌మైన క‌రోనా కొత్త చికిత్స‌?

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>