PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2f9cb9-9c3e-40e9-9511-cccbc8c2fb35-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2f9cb9-9c3e-40e9-9511-cccbc8c2fb35-415x250-IndiaHerald.jpgప్రభుత్వాలు చేసే ఆర్థిక కార్యకలాపాలను ఓ కంట కనిపెట్టే వ్యవస్థే కాగ్. అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. ఏడాది లెక్కలను ఈ కాగ్ మదింపు చేస్తుంది. ప్రభుత్వం రాబడి, వ్యయం తీరుతెన్నులను విశ్లేషిస్తుంది. తప్పు ఒప్పులను నిర్భయంగా బయటపెడుతుంది. అందుకే కాగ్ నివేదిక అంటే ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే పత్రం అన్నమాట. గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలు.. వాస్తవానికి ఖర్చు చేసిన తీరు, రాబడి వివరాలు పరిశీలిస్తే తెలంగాణ సర్కారుకు మంచి మార్కులే పడతాయి. కాగ్ నివేదికలో ముఖ్య అంశాలేంటంటే.. తెలంగాణ సర్కారు ఆశించిkcr;kcr;telangana;2020;central government;march;nirbayaకాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!kcr;kcr;telangana;2020;central government;march;nirbayaThu, 27 May 2021 07:10:00 GMTప్రభుత్వాలు చేసే ఆర్థిక కార్యకలాపాలను ఓ కంట కనిపెట్టే వ్యవస్థే కాగ్. అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. ఏడాది లెక్కలను ఈ కాగ్ మదింపు చేస్తుంది. ప్రభుత్వం రాబడి, వ్యయం తీరుతెన్నులను విశ్లేషిస్తుంది. తప్పు ఒప్పులను నిర్భయంగా బయటపెడుతుంది. అందుకే కాగ్ నివేదిక అంటే ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే పత్రం అన్నమాట. గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలు.. వాస్తవానికి ఖర్చు చేసిన తీరు, రాబడి వివరాలు పరిశీలిస్తే తెలంగాణ సర్కారుకు మంచి మార్కులే పడతాయి.
 
కాగ్ నివేదికలో ముఖ్య అంశాలేంటంటే.. తెలంగాణ సర్కారు ఆశించిన రీతిలో కేంద్రం నుంచి నిధులు రాలేదు. అలాగే తాను ఆశించినట్టు పన్నేతర ఆదాయమూ రాలేదు. ఈ రెండింటి విషయంలో కోత పడింది. అయితే పన్ను ఆదాయం మాత్రం తెలంగాణ సర్కారు అంచనా వేసినట్టే వచ్చింది. కేంద్రం నుంచి ఆశించినంత ఆదాయం రాకపోవడంతో అప్పులు పెరిగాయి.

మూల ధన వ్యయం విషయంలో మాత్రం తెలంగాణ సర్కారు పనితీరు బావుందని కాగ్ నివేదిక చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సవరణల బడ్జెట్‌ ప్రకారం.. 2020-21లో రూ.10,561.18 కోట్ల మూల ధన వ్యయం జరగాల్సి ఉంది.  2021, మార్చి 31 నాటికి రూ.16,181.30 కోట్ల వ్యయం జరిగింది. ద్రవ్యలోటు కూడా కాగ్‌ లెక్కల ప్రకారం ప్రభుత్వ అంచనాలకు మించి ఉంది. ప్రభుత్వం గత ఏడాది రూ.42,399 కోట్ల మేర ద్రవ్యలోటు అంచనా వేయగా, అది రూ.45వేల కోట్లు దాటింది.

2020-21లో మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వనరుల రూపంలో రూ.1,45,599.95 కోట్లు సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.1,66,728.91 కోట్లు వస్తుందని అంచనా వేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనా కంటే రూ. 21వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిందన్నమాట. పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటాలో తగ్గుదల కారణంగా ప్రభుత్వ అంచనాల్లో కూడా తగ్గుదల కనిపించింది.

2020-21లో రూ.34 వేల కోట్లకు పైగా రుణాల ద్వారా సమీకరించాలని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భావించారు. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ప్రతిపాదనలను సవరించి రూ. 43,784 కోట్ల అప్పులు అవసరం అవుతాయని అంచనా వేశారు. కానీ ఏకంగా రూ.45,638.79 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాందేవ్ బాబా పై బీహార్ బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కాటసానికి బీసీతో ఇబ్బందేనా?

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>