PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e83914f4-2668-46e5-b144-56c14bf3e866-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e83914f4-2668-46e5-b144-56c14bf3e866-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ మహానాడు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. మహానాడు లో అనేక విషయాలు చర్చిస్తారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల మీద కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. దానికి కారణం టీడీపీ జాతీయ రాజకీయాల్లో కూడా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించింది. tdp{#}Telugu Desam Party;TDP;Party;CBN;Hyderabad;NTR;Jagan;YCP;Government;Andhra Pradeshమహానాడు సాక్షిగా ఆ ఊసే లేదుగా... ?...మహానాడు సాక్షిగా ఆ ఊసే లేదుగా... ?...tdp{#}Telugu Desam Party;TDP;Party;CBN;Hyderabad;NTR;Jagan;YCP;Government;Andhra PradeshThu, 27 May 2021 20:00:00 GMTతెలుగుదేశం పార్టీ మహానాడు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. మహానాడు లో అనేక విషయాలు చర్చిస్తారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల మీద కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. దానికి కారణం టీడీపీ జాతీయ రాజకీయాల్లో కూడా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించింది.

టీడీపీ మామూలు పార్టీ కాదు. దాని పునాదులు చాలా బలమైనవి. ఉమ్మడి ఏపీని మూడున్నర దశాబ్దాల పాటు తనదైన ముద్రతో శాసించిన పార్టీ అది. అటువంటి టీడీపీ విభజన తరువాత కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయింది. తెలంగాణాలో బలం ఉన్నా కూడా ఆ పార్టీ అక్కడ పెద్దగా సౌండ్ చేయడంలేదు. మరి జాతీయ అధ్యక్షుడు అని చంద్రబాబు చెప్పుకుంటారు.

పైగా ఆయన ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ల పాటు పాలించారు. తెలంగాణాలో కూడా టీడీపీకి అభిమానజనం ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే టీడీపీ జన్మస్థలమే తెలంగాణా. హైదరాబాద్ లో ఆ పార్టీ పుట్టింది. ఎన్టీయార్ నాడు పార్టీకి అక్కడే పురుడు పోశారు. అటువంటి టీడీపీ మహానాడు అజెండాలో చేర్చిన అంశాలు చూస్తే చిత్రంగా ఉంటుంది.

అన్నీ కూడా జగన్ మీద బాణాలే వేసేందుకు వాడుకున్నారు. ఏపీలో కరోనా కట్టడిలో వైసీపీ విఫలం అయిందని విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని కూడా గొంతు పెంచారు. కానీ ఇవే రకమైన విమర్శలు తెలంగాణా ప్రభుత్వం మీద ఇతర పార్టీలు చేస్తున్నాయి కానీ టీడీపీ మాత్రం ఎందుకో ఆ ఊసే మరచింది. కనీసం మహానాడులో అయినా తెలంగాణా గురించి చర్చిస్తారు అనుకుంటే ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. మరి ఈ విధంగా చూస్తే తెలంగాణా ఊసుని ఆ పార్టీ మరచిందా లేక ఆశలు వదిలేసుకుందా అన్నదే చర్చగా ఉందిట. తెలుగుదేశం పార్టీ 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసింది. అదే విధంగా ఉనికి కూడా నిలబెట్టుకుంది. అటువంటి పార్టీ ఎందుకు తెలంగాణాను విస్మరిస్తోంది అన్నదే అందరి ఆలోచనగా ఉందిపుడు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాటుసారా వైపు గ్రామాలు.. జగన్ ది కాదు జనాలదే బాధ్యత?

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>