MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directors-b7c838e1-c661-4460-bc61-3fad9313c3c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directors-b7c838e1-c661-4460-bc61-3fad9313c3c2-415x250-IndiaHerald.jpgఅక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు రెండూ కూడా విజయాలు సాధించి పవన్ కు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ సినిమాల అనంతరం యువ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ నటించిన సినిమా తొలిప్రేమ. కీర్తి రెడ్డి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి దేవా మ్యూజిక్ అందించగా జివిజి రాజు నిర్మించారు. Pawan-Kalyan{#}Akkada ammai Ikkada abbai;Tollywood;Pawan Kalyan;Suswagatham;PAWAN;Yuva;karunakaran;Cinema;keerthi reddy;king;Girl;Love;kirti;Audience;s j surya;Bhumika Chawla;mani sharma;Romantic;siddhu;harish shankar;Pawan-Kalyan;Blockbuster hit;bandla ganesh;Shruti Haasan;Success;Gabbar Singh;Massపవన్ కెరీర్ ని మలుపుతిప్పిన మూడు సినిమాలు ... !!పవన్ కెరీర్ ని మలుపుతిప్పిన మూడు సినిమాలు ... !!Pawan-Kalyan{#}Akkada ammai Ikkada abbai;Tollywood;Pawan Kalyan;Suswagatham;PAWAN;Yuva;karunakaran;Cinema;keerthi reddy;king;Girl;Love;kirti;Audience;s j surya;Bhumika Chawla;mani sharma;Romantic;siddhu;harish shankar;Pawan-Kalyan;Blockbuster hit;bandla ganesh;Shruti Haasan;Success;Gabbar Singh;MassThu, 27 May 2021 16:31:41 GMTఅక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు రెండూ కూడా విజయాలు సాధించి పవన్ కు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ సినిమాల అనంతరం యువ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ నటించిన సినిమా తొలిప్రేమ. కీర్తి రెడ్డి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి దేవా మ్యూజిక్ అందించగా జివిజి రాజు నిర్మించారు.

అప్పట్లో ఈ సినిమా భారీ విజయం దక్కించుకుని యువతలో పవన్ కు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. యూత్ ఫుల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పటి యువతని ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ తొలిసారిగా కీర్తి ని చూసే సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతో అలరించాయి. ఇక పవన్ కెరీర్ లో ఎస్ జె సూర్య దర్శకత్వంలో నటించిన తొలి సినిమా ఖుషి. భూమిక చావ్లా హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసారు. 2001లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించి పవన్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచింది. ఈ సినిమాలో పవర్ స్టార్, భూమికలు రొమాంటిక్ సీన్స్, మణిశర్మ సాంగ్స్, ఆకట్టుకునే కథ, కథనాలు మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.ముఖ్యంగా సిద్దు సిద్దార్ధ రాయ్ అంటూ పలికే డైలాగ్స్ తో పాటు పవన్, భూమికల మధ్య వచ్చే రొమాంటిక్ నడుము సీన్ యువత ని ఎంతో ఆకట్టుకున్నాయి.

అలానే ఈ సినిమాల అనంతరం యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంతకముందు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం పరితపిస్తున్న పవన్ కెరీర్ కు గబ్బర్ సింగ్ సూపర్ సక్సెస్ ఎంతో బూస్ట్ నిచ్చింది అనే చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళు గా తమ హీరోని తెరపై ఎలా చూడాలని ఎదురు చూస్తున్నారో అంతకు మించేలా పవన్ ని అదరగొట్టే రోల్ లో చూపించారు హరీష్ శంకర్. ఈ సినిమాలో పవన్ పలికే డైలాగ్స్, మాస్ ఫైట్స్, యాక్షన్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోయాయి. ఈ విధంగా తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ కెరీర్ ని మలుపుతిప్పిన సినిమాలుగా నిలిచాయి .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటుకు నోటు కుంభకోణంలో కీలకమైన పరిణామం

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>