MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rashmi-new-photo-pictures-d947b99a-f518-4ff3-8d7d-078d4ffb3624415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rashmi-new-photo-pictures-d947b99a-f518-4ff3-8d7d-078d4ffb3624415x250-IndiaHerald.jpgకెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీకి పెద్ద గా గుర్తింపు దక్కలేదు. దీంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ ఎనలేని క్రేజ్ సంపాదించింది. తెలుగు వారిలో జబర్దస్త్ అంటే తెలియనివారుండరు అలాగే జబర్దస్త్ లో రష్మీ అనే పేరుకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా సుధీర్ రష్మీ జోడి తో మల్లెమాల వాళ్ళు మంచి టీఆర్పీలు సాధించారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే వెండితెర మీద వెలిగిపోదామని ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామకు ఇప్పటికీ సరైన అవకాశం అయితే దక్కలేదు. అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ tollywood;akkineni nagarjuna;anasuya bharadwaj;bhama;kajal aggarwal;praveen;rashmi gautham;sudigali sudheer;cinema;jabardasth;heroine;guntur talkies;rashami desai;anasuya 1రష్మీకి బంపర్ ఆఫర్!రష్మీకి బంపర్ ఆఫర్!tollywood;akkineni nagarjuna;anasuya bharadwaj;bhama;kajal aggarwal;praveen;rashmi gautham;sudigali sudheer;cinema;jabardasth;heroine;guntur talkies;rashami desai;anasuya 1Thu, 27 May 2021 07:00:00 GMTకెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీకి పెద్ద గా గుర్తింపు దక్కలేదు. దీంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ ఎనలేని క్రేజ్ సంపాదించింది. తెలుగు వారిలో జబర్దస్త్ అంటే తెలియనివారుండరు అలాగే జబర్దస్త్ లో రష్మీ అనే పేరుకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా సుధీర్ రష్మీ జోడి తో మల్లెమాల వాళ్ళు మంచి టీఆర్పీలు సాధించారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే వెండితెర మీద వెలిగిపోదామని ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామకు ఇప్పటికీ సరైన అవకాశం అయితే దక్కలేదు. 


అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటున్నా సరే సరైన బ్రేక్ వచ్చే సినిమా మాత్రం ఒక్కటి కూడా ఈ భామకు దక్కలేదు. అయితే ఇన్నాళ్ళకు ఈ భామ దశ తిరిగే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామకు ఒక మంచి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా గోవాలో పూర్తయింది. 


రెండవ షెడ్యూల్ హైదరాబాద్లో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ప్రవీణ్ సత్తార్ చేసిన గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మీ. ఆ పరిచయంతోనే ప్రవీణ్ సత్తారు ఈ భామకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించిన తర్వాత మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ దశ తిరిగింది. మరి అలాగే రష్మీ దశ కూడా తిరిగి మంచి స్టార్ అవుతుందేమో చూడాలి మరి..

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాందేవ్ బాబా పై బీహార్ బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కాటసానికి బీసీతో ఇబ్బందేనా?

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>