PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-b4133fc5-5d82-4bce-95d7-6178f7147921-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-b4133fc5-5d82-4bce-95d7-6178f7147921-415x250-IndiaHerald.jpgగుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ చాలాసార్లు టీడీపీ విజయం సాధించింది. అయితే కొడాలి నాని వచ్చాక పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ పార్టీల కంటే నాని వ్యక్తిగతంగా బలపడిపోయారు. మొదట నాని టీడీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ సమయంలోనే నాని సొంత ఇమేజ్‌ని పెంచుకున్నారు.kodali nani{#}2019;Amarnath Cave Temple;TDP;Kodali Nani;Nani;Cheque;YCP;Minister;politics;devineni avinash;CBNరావితో కొడాలికి ఇబ్బంది లేదా?రావితో కొడాలికి ఇబ్బంది లేదా?kodali nani{#}2019;Amarnath Cave Temple;TDP;Kodali Nani;Nani;Cheque;YCP;Minister;politics;devineni avinash;CBNThu, 27 May 2021 14:00:00 GMTగుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ చాలాసార్లు టీడీపీ విజయం సాధించింది. అయితే కొడాలి నాని వచ్చాక పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ పార్టీల కంటే నాని వ్యక్తిగతంగా బలపడిపోయారు. మొదట నాని టీడీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ సమయంలోనే నాని సొంత ఇమేజ్‌ని పెంచుకున్నారు.


అందుకే నాని తర్వాత వైసీపీలోకి వెళ్ళిన ఆయన విజయానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ గుడివాడలో కొడాలి నాని టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా నాని సత్తా చాటారు. మరోసారి వైసీపీ తరుపున గెలిచి, మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మంత్రి అయ్యాక నాని మరింత దూకుడుగా ఉంటున్నారు.


ఈయన దెబ్బకు గుడివాడలో టీడీపీ జెండానే కనిపించడం లేదు. అసలు గుడివాడ అంటే నాని, నాని అంటే గుడివాడ అనే మాదిరిగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ కొడాలి నాని దెబ్బకు టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం సైడ్ అయిపోయారు. 2014లోనే నానిపై రావి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో నాని మీద దేవినేని అవినాష్‌ని నిలబెట్టారు. అవినాష్ సైతం నాని దెబ్బకు తట్టుకోలేకపోయారు. కోట్లు ఖర్చు పెట్టినా సరే నానీని ఓడించలేకపోయారు.


ఓడిపోయాక అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు మళ్ళీ రావిని గుడివాడ ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఇలా ఇన్‌చార్జ్‌గా ఉన్నా సరే నానికి రావి చెక్ పెట్టలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం నానీని ఓడించే కెపాసిటీ రావికి లేదు. అలాగే ఆర్ధికంగా కూడా నానీని ఢీకొట్టలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గుడివాడలో కొడాలి నాని గెలుపుకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. ఏదేమైనా నాని...టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడని తన అడ్డాగా మార్చేసుకున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

భారత సైన్యంలోకి స్పైడర్..

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>