MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/ek-mini-katha-review6fa9a95b-560c-40ba-a9be-abb60966ee8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/ek-mini-katha-review6fa9a95b-560c-40ba-a9be-abb60966ee8b-415x250-IndiaHerald.jpgగోల్కొండ హై స్కూల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు సంతోష్ శోభన్. ఆ తరవాత తను నేను, పేపర్ బాయ్ సినిమాలతో సంతోష్ శోభన్ హీరోగా మారాడు. ఆయన నటించిన రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులనుఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా శోభన్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గాek mini katha review;review;karthik;bharathi old;kavya thapar;merlapaaka gandhi;santhosh;santosh sobhan;saptagiri;sudarshan;mini;mohandas karamchand gandhi;cinema;amazon;school;audience;comedy;heroine;romantic;v creations;uv creations;santhossh jagarlapudi;v;beautiful;golcondaReview: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!ek mini katha review;review;karthik;bharathi old;kavya thapar;merlapaaka gandhi;santhosh;santosh sobhan;saptagiri;sudarshan;mini;mohandas karamchand gandhi;cinema;amazon;school;audience;comedy;heroine;romantic;v creations;uv creations;santhossh jagarlapudi;v;beautiful;golcondaThu, 27 May 2021 09:22:19 GMTగోల్కొండ హై స్కూల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు సంతోష్ శోభన్. ఆ తరవాత తను నేను, పేపర్ బాయ్ సినిమాలతో సంతోష్ శోభన్ హీరోగా మారాడు. ఆయన నటించిన రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులనుఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా శోభన్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏక్ మినీ కథ’. ఈ సినిమా యువి క్రియేషన్స్ నిర్మాణంలో నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యింది. మరీ ఈ ఏక్ మినీ కథ ఎంటర్టైన్ చేసిందో లేదో చూద్దాం.

ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో సంతోష్ శోభన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమా ఇదని చెప్పచ్చు. పురుషాంగం విషయంలో ఆత్మ నూన్యతా భావంతో బాధపడే కుర్రాడి పాత్రలో పలు చోట్ల తన హావభావాలతో నవ్విస్తాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ సూపర్బ్. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కావ్య థాపర్ చూడటానికి నాజూగ్గా, సింపుల్ అండ్ స్వీట్ గర్ల్ గా కనిపించడమే కాకుండా, ఉన్నంతలో మంచి నటనని కనబరిచింది.

ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో కావ్య థాపర్ అందాల ప్రదర్శన కుర్రకారుకి కనువిందు చేస్తుందనే చెప్పాలి. సంతోష్ – శోభన్ – సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. శ్రద్ధ దాస్ ది చెప్పుకోదగిన పాత్ర కాదు. బ్రహ్మాజీ, హర్షవర్ధన్ లు తమ పాత్రలకి న్యాయం చేస్తే సప్తగిరి పాత్ర నవ్వించలేకపోయింది.

సింపుల్ బడ్జెట్ లో సినిమాని విజువల్ గా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రాఫర్ గోకుల్ భారతి ప్రతి ఫ్రేమ్ ని బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ పాయింట్ చాలా చిన్నది. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పకుండా అనవసరమైన ట్రాక్స్ తో సాగదీయడం వలన కథ పరంగా సెకండాఫ్ చాలా బోర్ కొడుతోంది. మొదటి అర్ధభాగం 45 నిమిషాల వరకూ ఓకే ఇక అక్కడి నుంచీ ఏదో సాగదీస్తున్నట్టే ఉంటుంది. అదీకాక సెకండాఫ్ లో వేసుకున్న కామెడీ ట్రాక్స్ వర్కౌట్ కాకపోవడం వలన బోర్ కొట్టేస్తుంది. సీరియస్ గా తీసుకెళ్లాల్సిన చోట కూడా కామెడీ చేసేయడంతో ఎమోషనల్ ఫీల్ కూడా వర్కౌట్ అవ్వలేదు.

ఇది సినిమాను కామెడీ అనుకుంటూ వెళ్లిపోయారు తప్ప కథ ఆసక్తికరంగా వెళ్తోందా అన్న విషయాన్ని మిస్ అయ్యారు. మేర్లపాక గాంధీ రాసిన వన్ లైవ్ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ రాపోలు నటన రాబట్టుకోవడంలో, కామెడీ సీన్స్ ని కొంతవరకూ డీల్ చేయగలిగాడు కానీ ఓవరాల్ మూవీతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి మరి



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క డాక్టర్..1,511 పేషెంట్స్?

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>