PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-2aed35e6-f115-439a-9961-2b5427a60aa9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-2aed35e6-f115-439a-9961-2b5427a60aa9-415x250-IndiaHerald.jpgజగన్‌తో ఉంటే బాగుండేది....ఈ మాట గతంలో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన ప్రతి నాయకుడు అనుకుంటుందే అని గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పుడు పార్టీ మారిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలో ఉండి బాధపడుతున్నారు. 2014లో వైసీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే.jagan;jagan;adinarayanareddy;2019;cinema;k s ravikumar;mla;tdp;ycp;gottipati ravi kumar;addanki;party;mantraజగన్‌తో ఉంటే బాగుండేది...!జగన్‌తో ఉంటే బాగుండేది...!jagan;jagan;adinarayanareddy;2019;cinema;k s ravikumar;mla;tdp;ycp;gottipati ravi kumar;addanki;party;mantraThu, 27 May 2021 02:00:00 GMTజగన్‌తో ఉంటే బాగుండేది....ఈ మాట గతంలో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన ప్రతి నాయకుడు అనుకుంటుందే అని గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పుడు పార్టీ మారిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలో ఉండి బాధపడుతున్నారు. 2014లో వైసీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే.


చంద్రబాబు అనేక ప్రలోభాలకు గురిచేసి వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. అయితే అధికారం ఉందని ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. ఇక అధికారం ఉన్నన్ని రోజులు బాగానే గడిపారు. కానీ 2019 ఎన్నికల్లోనే అసలు సినిమా కనపడింది. అయితే టీడీపీలో మళ్ళీ టిక్కెట్ దక్కదని తెలిసిన కొందరు ఎమ్మెల్యేలు, మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలో టిక్కెట్ దక్కకపోయినా సైలెంట్‌గా ఉండిపోయారు.


ఇక టీడీపీ తరుపున పోటీ చేసిన మిగిలిన ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. అయితే అందులో ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రం మళ్ళీ అద్దంకి నుంచి గెలిచారు. మిగిలిన నాయకులు దారుణంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. అయితే కొందరు నాయకులు మళ్ళీ వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. కానీ తనని మోసం చేసి వెళ్ళిన వారిని జగన్ తిరిగి ఆహ్వానించడానికి సిద్ధంగా లేరని తెలిసింది. దాంతో ఆ నాయకులు టీడీపీలోనే సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఆదినారాయణరెడ్డి లాంటి వారు బీజేపీలోకి వెళ్లారు.


అలా సైలెంట్‌గా ఉన్న నాయకులు ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్‌తో ఉంటే మంచి మంచి పదవులు వచ్చేవని, పదవులు రాకపోయినా కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారంలో ఉండేవారమని అనుకుంటున్నారట. వాస్తవానికి ఇప్పుడు టీడీపీలోనే ఉండిపోయిన కొందరు సీనియర్ నాయకులు వైసీపీని వీడకుండా ఉంటే మళ్ళీ గెలిచి మంత్రులుగా కూడా పనిచేసేవారు. కానీ అప్పుడు అధికారం కోసం ఆశపడి జగన్‌ని వదిలేసి, టీడీపీలోకి వచ్చి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. మొత్తానికైతే జగన్‌ని వదలడం ఆ జంపింగ్ నేతల రాజకీయ భవిష్యత్ దెబ్బతిందనే చెప్పొచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ పాలిటిక్స్: ఈటలని బుక్ చేసినట్లేనా..!

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>