HistorySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-27-history808d32e0-93ac-4523-9b79-291f78879532-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-27-history808d32e0-93ac-4523-9b79-291f78879532-415x250-IndiaHerald.jpgక్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 27 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రముఖుల జననాలు: 1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406) 1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983) 1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016). 1957: నితిన్ గడ్కరీ, భmay 27 history;kumaar;ankhita;geetha;sampath;cricket;united states;palani;west bengal - kolkata;australia;new zealand;sri lanka;switzerland;mohandas karamchand gandhi;nitin gadkari;cinema;sangeetha;barack obama;nobel award;engineer;hollywood;court;prime minister;chief minister;writer;kannada;lawyer;february;minister;prize;murder.;gift;central government;ravi shastri;nithin reddy;sampath kumar;v;christopher nolanమే 27వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?మే 27వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?may 27 history;kumaar;ankhita;geetha;sampath;cricket;united states;palani;west bengal - kolkata;australia;new zealand;sri lanka;switzerland;mohandas karamchand gandhi;nitin gadkari;cinema;sangeetha;barack obama;nobel award;engineer;hollywood;court;prime minister;chief minister;writer;kannada;lawyer;february;minister;prize;murder.;gift;central government;ravi shastri;nithin reddy;sampath kumar;v;christopher nolanThu, 27 May 2021 06:00:00 GMT


ప్రముఖుల జననాలు:



1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406)



1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)



1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).


1957: నితిన్ గడ్కరీ, భారత న్యాయవాది, రాజకీయవేత్త, భారత రవాణా మంత్రి.



1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.



1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.



1975: మైఖేల్ హస్సీ, ఆస్ట్రేలియా క్రికెటర్



1977: మహేలా జయవర్ధనే, శ్రీలంక క్రికెటర్



1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.



1982: నటాల్య, కెనడియన్ ప్రొఫెషనల్ రెజ్లర్



ప్రముఖుల మరణాలు:



1896 - అలెగ్జాండర్ స్టోలెటోవ్, రష్యన్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్, విద్యావేత్త (జ.1839)



1910: రాబర్ట్ కాక్, జర్మన్ వైద్యుడు, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).



1918: ఉట్సు మన్మోన్, జపనీస్ సుమో రెజ్లర్, 18వ యోకోజునా (జ .1869)



1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848)



1943: గోర్డాన్ కోట్స్, న్యూజిలాండ్ సైనికుడు, రాజకీయవేత్త, న్యూజిలాండ్ 21వ ప్రధాన మంత్రి (జ .1878)



1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).



1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)



1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)


1986: అజోయ్ ముఖర్జీ, భారత రాజకీయవేత్త, మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (జ .1901)



1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)



2015: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).



2017: గ్రెగ్ ఆల్మాన్, అమెరికన్ సంగీతకారుడు, గాయకుడు, పాటల రచయిత (జ .1947)



ముఖ్య సంఘటనలు:



1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన.



1921: ఆఫ్ఘనిస్తాన్ 84 సంవత్సరాల తరువాత బ్రిటిష్ నియంత్రణ నుండి స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది.



1931: స్విస్ భౌతిక శాస్త్రవేత్త అగస్టే పిక్కార్డ్, అతని సహోద్యోగి చార్లెస్ నిప్ఫర్ కలిసి బెలూన్‌లో కూర్చొని స్ట్రాటో ఆవరణంలోకి మొట్టమొదటిగా ప్రయాణించారు. ఈ బెలూన్‌ 17 గంటల సమయంలో 51,793 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇది విమానయాన చారిత్రక సందర్భాలలో ఒకటిగా నిలిచింది.



1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.



1948: ఎర్రకోటలోని ప్రత్యేక న్యాయస్థానంలో మహాత్మా గాంధీ హత్య విచారణ ప్రారంభమైంది.  తొమ్మిది మంది వ్యక్తులు గాంధీని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాగా, 1949 ఫిబ్రవరి 10న విచారణ ముగిసింది.



1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.



1995: నాలుగు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో సూపర్ మ్యాన్ పాత్రలు పోషించి ప్రసిద్ది గాంచిన నటుడు క్రిస్టోఫర్ రీవ్ గుర్రంపై స్వారీ చేస్తూ కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన వెన్నెముక కి తీవ్రమైన గాయం అయింది. ఆ గాయం మరింత తీవ్రంగా ఉండటంతో తన మెడ నుంచి ఇతర భాగాలు ఏమీ పని చేయడం లేదని క్రిస్టోఫర్ అనుకున్నారు.



2016 - హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి హిబాకుషాను కలిసిన యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.



పండుగలు, జాతీయ దినాలు:



సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ డే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వార్నింగ్.. ఈ నాలుగు రోజులూ ఆంధ్రా అగ్ని గుండమే..!

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>