PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jawaharlal-nehru-death-anniversary64d5cb5d-95f3-4d82-8f29-b609b9886204-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jawaharlal-nehru-death-anniversary64d5cb5d-95f3-4d82-8f29-b609b9886204-415x250-IndiaHerald.jpgస్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ మే 27, 1964 లో హార్ట్ ఎటాక్ తో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఈరోజు నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు.. వచ్చిన తర్వాత చేసిన సేవలను స్మరించుకుందాం. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు కశ్మీరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అలహాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంగ్లండ్ వెళ్లి న్జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి{#}jeevitha rajaseskhar;Prime Minister;Heart Attack;November;vidya;Ishtam;Evening;Governmentవర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి{#}jeevitha rajaseskhar;Prime Minister;Heart Attack;November;vidya;Ishtam;Evening;GovernmentThu, 27 May 2021 10:52:00 GMTప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ మే 27, 1964 లో హార్ట్ ఎటాక్ తో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఈరోజు నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు.. వచ్చిన తర్వాత చేసిన సేవలను స్మరించుకుందాం. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు కశ్మీరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అలహాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంగ్లండ్ వెళ్లి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కానీ ఆయనకు లాయర్ గా ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు. దీనితో స్వదేశానికి తిరిగివచ్చి జాతీయోద్యమంలో పాల్గొని మహాత్మాగాంధీకి మంచి స్నేహితులయ్యారు.

ఐతే భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొన్న జవహర్‌లాల్ నెహ్రూ పలుమార్లు జైలు పాలయ్యారు. బ్రిటిష్ వారు నెహ్రూ ని నిర్బంధించి బెదిరించినప్పటికీ ఆయన కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. బ్రిటిషర్లు ఎంతగా బెదిరిస్తే అంతకుమించి ధైర్యంతో నెహ్రూ తన సంకల్పాన్ని దృఢంగా మార్చుకున్నారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘ది డిస్కవరీ అఫ్ ఇండియా’ పుస్తకాలు రచించారు. జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్రం వచ్చిన సాయంత్రం ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అని అద్భుతంగా ప్రసంగించారు. 20వ శతాబ్దంలోని గొప్ప ప్రసంగాలలో ఆయన ప్రసంగం కూడా ఒకటని చెబుతుంటారు.

1929 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిన నెహ్రూ 1936, 1937, 1946 సంవత్సరాల్లో కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ తరువాత రెండో ప్రముఖ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

స్వాతంత్య్రం ఇచ్చిన సమయంలో 1946వ సంవత్సరంలో తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పడగా.. నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన అన్ని బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి భారత ప్రధానిగా అవతరించారు. 1952, 1957, 1962 సంవత్సరాల్లో కాంగ్రెస్ ని అత్యంత సమర్థవంతమైన పార్టీగా నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. సుధీర్ఘ కాలంపాటు పనిచేసిన నెహ్రూ భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేస్టేజ్‌లో ఆ రాష్ట్రాలే టాప్.. కారణం అదేనా..

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?

2014 ఎన్నికల్లో ఆ విషయంలో పవన్ టాప్ తెలుసా?

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>