PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/black-fungus131b1a02-0400-422a-8dc5-6ebb5440d45d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/black-fungus131b1a02-0400-422a-8dc5-6ebb5440d45d-415x250-IndiaHerald.jpgకరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరగడం ఆందోళనకు దారి తీస్తోంది. అయితే బ్లాక్ ఫంగక్ కేసులు కచ్చితంగా రెండు నెలల్లో తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. గతంలో ఉన్న వ్యాధే అయినా.. కరోనా తర్వాత దీని వ్యాప్తి పెరిగిందని, దీనికి కారణం కరోనా చికిత్సలో వాడుతున్న మందులేనని తేల్చారు. అతిగా స్టెరాయిడ్స్ వాటడం వల్లే రోగనిరోధక శక్తి తగ్గి బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోందని అంటున్నారు. black-fungus;education;sugar;chandigarh;shaktiబ్లాక్ ఫంగస్ కి డెడ్ లైన్ అదే..బ్లాక్ ఫంగస్ కి డెడ్ లైన్ అదే..black-fungus;education;sugar;chandigarh;shaktiThu, 27 May 2021 09:00:00 GMTకరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరగడం ఆందోళనకు దారి తీస్తోంది. అయితే బ్లాక్ ఫంగక్ కేసులు కచ్చితంగా రెండు నెలల్లో తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. గతంలో ఉన్న వ్యాధే అయినా.. కరోనా తర్వాత దీని వ్యాప్తి పెరిగిందని, దీనికి కారణం కరోనా చికిత్సలో వాడుతున్న మందులేనని తేల్చారు. అతిగా స్టెరాయిడ్స్ వాటడం వల్లే రోగనిరోధక శక్తి తగ్గి బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోందని అంటున్నారు.

బ్లాక్ ఫంగస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టాలంటే, విచ్చలవిడి స్టెరాయిడ్స్ వాడకం తగ్గాలి, అంటే కరోనా చికిత్సలో వాటి వాడకం తగ్గాలి, అది జరగాలంటే కరోనా కేసులు కూడా తగ్గాలి. ప్రస్తుతం కేసుల వ్యాప్తి తగ్గుదున్న దృష్ట్యా.. కరోనాతోపాటే, బ్లాక్ ఫంగస్ కూడా త్వరలోనే తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు వైద్యులు. చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో కరోనా చికిత్సలో 63శాతం మంది రోగులు అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడారని, వీరిపై పలు దుష్ప్రభావాలు కనిపించాయని తేలింది. ఈ దుష్ప్రభావాల్లో ఒకటి బ్లాక్ ఫంగస్.

రోజుకి 6మిల్లీ గ్రాములకు మించి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకపోయినా.. కొన్ని చోట్ల కరోనా రోగులకు 30మిల్లీగ్రాముల డోసు వరకు ఇచ్చారని, అలాంటి వారిలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగాయని ఈ పరిశోధన బృందం తేల్చింది. కరోనా వచ్చిన షుగర్ వ్యాధి గ్రస్తుల్లో సుమారు 25 శాతంమందిలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగాయి. 300 - 400 వరకు కొంతమందిలో కనిపించాయి. మరికొందరిలో అసాధారణంగా 600 నుంచి 800 వరకు లెవల్స్ పెరిగాయి. కొవిడ్, ఆ తర్వాత స్టెరాయిడ్స్ వినియోగం.. ఇలా రోగ నిరోధక శక్తి తగ్గడానికి వరుస కారణాలు ఉండటంతో.. బ్లాక్ ఫంగస్ దాడి చేసిందని తెలుస్తోంది. కరోనా కేసుల పెరుదల ఆగిపోయిన తర్వాత, బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గిపోతాయని, అయితే ఇటీవలే ఇవి వెలుగుచూడటం మొదలైంది కాబట్టి.. మరో 2నెలలపాటు బ్లాక్ ఫంగస్ ఉనికి ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్ : మార్కెట్ లోకి నేడే!

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>