MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra36a1bf6-609d-45e2-b3c9-03b8938a5271-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra36a1bf6-609d-45e2-b3c9-03b8938a5271-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావుని కారణ జన్ముడు అంటారు. 73 ఏళ్లు జీవించిన రామారావు తెలుగు వారు అందరికీ స్పూర్తిదాయకం. ఆయన సినీ రాజకీయ జీవితాలు చూస్తే ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది. ఆయన ఆలోచనలకు ఎక్కడా బ్రేకులు లేవులు లేవు. అనుకున్నది చేయడమే ఆయన నైజం. ntr{#}NTR;nandamuri taraka rama rao;Telugu;CMఆ బర్త్ డే ఎన్టీయార్ కి వెరీ స్పెషల్... ?ఆ బర్త్ డే ఎన్టీయార్ కి వెరీ స్పెషల్... ?ntr{#}NTR;nandamuri taraka rama rao;Telugu;CMThu, 27 May 2021 19:00:00 GMTనందమూరి తారక రామారావుని కారణ జన్ముడు అంటారు. 73 ఏళ్లు జీవించిన రామారావు తెలుగు వారు అందరికీ స్పూర్తిదాయకం. ఆయన సినీ రాజకీయ జీవితాలు చూస్తే ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది. ఆయన ఆలోచనలకు ఎక్కడా బ్రేకులు లేవు. అనుకున్నది చేయడమే ఆయన నైజం.

దానికి తగినట్లుగా ప్రజల ప్రోత్సాహం కూడా ఆయనకు నిండుగా మెండుగా ఉండేది. ఎన్టీయార్ 1980 ప్రాంతంలో సర్దార్ పాపారాయుడు షూటింగ్ టైమ్ లో రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయన రాజకీయ‌ ప్రవేశానికి రంగం చకచకా సాగింది. ఎన్టీయార్ 1982 డైరీని పూర్తిగా ఖాళీ పెట్టేసుకున్నారు. సినిమాలు అన్నీ కూడా 1981లోనే పూర్తి చేశారు. కొన్ని కమిట్మెంట్స్ ఉన్నా ఆయన వాటిని పక్కన పెట్టేసి ప్రజా సేవలోకి దిగిపోయారు.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ 1982లో పార్టీని ప్రకటించి తొమ్మిది నెలల పాటు ఉమ్మడి ఏపీ అంతా తిరిగి సీఎం అయిపోయారు. సీఎం గా ఆయన తొలి బర్త్ డే 1983 మే 28న వచ్చింది. ఎన్టీయార్ ఆ సమయంలో అంత బిజీలో కూడా తన సొంత బ్యానర్ మీద తీసిన సినిమా వర్క్ కొంత ఉంటే అది పూర్తి చేసి తన పుట్టిన రోజుకు రిలీజ్ చేశారు. ఆ విధంగా తన పుట్టిన రోజుకు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సినిమా రిలీజ్ చేసిన ఘనతను ఆయన సాధించారు.

అప్పటికి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రాధ రామారావు పక్కన హీరోయిన్. ఆమెని టీజ్ చేస్తూ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సినిమా విజయాన్ని ఆస్వాదించారు. ఇక ఈ మూవీకి ఆయన చెప్పిన డబ్బింగ్ మాత్రం కాస్తా తేడాగా ఉంటుంది. అప్పటికి  ఎన్నికల ప్రసంగాలు చేసి చేసి ఎన్టీయార్  గొంతు కొంత బొంగురుగా వచ్చింది. దాంతోనే ఈ మూవీకి డబ్బింగ్ చెప్పేశారు. అయితే ఆయనకు ఉన్నఅశేషమైన  ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అది సినిమా విజయం మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్విట్ట‌ర్ వాద‌న‌ను ఖండించిన కేంద్రం

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>