PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungusfa93fa0b-ac56-4709-9de3-5006901e1163-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungusfa93fa0b-ac56-4709-9de3-5006901e1163-415x250-IndiaHerald.jpgబ్లాక్ ఫంగస్.. కరోనా రోగులకు ఎక్కువగా వచ్చే ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు కరోనా కంటే ఎక్కువగా భయపెడుతోంది. కరోనా చికిత్స కారణంగా వాడిన స్టెరాయిడ్ల కారణంగా ఇప్పుడు చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల‌లో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ చాలా డేంజరస్.. ఏకంగా ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్‌ కేసులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్‌ గblack-fungus;pneumonia;shaktiబాబోయ్.. కరోనా రాకపోయినా బ్లాక్ ఫంగస్‌ వస్తుందట..!బాబోయ్.. కరోనా రాకపోయినా బ్లాక్ ఫంగస్‌ వస్తుందట..!black-fungus;pneumonia;shaktiThu, 27 May 2021 10:00:00 GMTబ్లాక్ ఫంగస్.. కరోనా రోగులకు ఎక్కువగా వచ్చే ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు కరోనా కంటే ఎక్కువగా భయపెడుతోంది. కరోనా చికిత్స కారణంగా వాడిన స్టెరాయిడ్ల కారణంగా ఇప్పుడు చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల‌లో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ చాలా డేంజరస్.. ఏకంగా ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్‌ కేసులకు చికిత్స అందించేందుకు  ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్‌ గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ బ్లాక్ ఫంగస్‌ కరోనా వచ్చిన రోగుల్లోనే కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులన్నీ నూటికి 99 శాతం అలాంటివే. అయితే.. కొవిడ్‌ సోకిన వారికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందా? ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందా? అనే ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ బ్లాక్‌ ఫంగస్ వ్యాధి కొత్తేం కాదని... కొవిడ్‌కు ముందు కూడా ఉందని చెబుతున్నారు.

మధుమేహం అంటే సుగర్ సరిగ్గా కంట్రోల్‌లో లేని వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందట.. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో బ్లాక్ ఫంగస్ బయటపడే అవకాశం ఉందట. రక్తంలో చక్కెర స్థాయులు 700-800కి చేరిన వారు, నిమోనియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో  బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొవిడ్ కారణంగా కొందరిలో స్టిరాయిడ్ల వాడకంతో బ్లాక్‌ ఫంగస్ ముప్పు పొంచి ఉంది. మొత్తంగా కరోనా పాజిటివ్ కాకపోయినా.. ఈ తరహా సమస్యలుంటే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉందన్న మాట.

అంతే కాదు.. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఈ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. బలహీన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశలో కొవిడ్ రకాలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. అందుకే బ్లాక్‌ ఫంగస్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సుగర్ వ్యాధి గ్రస్తులు కరోనా రాకపోయినా  జాగ్రత్తగా ఉండటం మంచిది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పశ్చిమ బెంగాల్ లో తీవ్ర గాలి దుమారం

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>