EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tv9abnbd571324-3bc5-4ec4-88ad-ea49c65aa9ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tv9abnbd571324-3bc5-4ec4-88ad-ea49c65aa9ff-415x250-IndiaHerald.jpgకృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య ఇస్తున్న ఆయుర్వేద మందు శాస్త్రీయ‌త‌పై ఇంకా ప్ర‌భుత్వం అధికారికంగా ఏమీ తేల్చిచెప్ప‌లేదు. ఈ మందు పంపిణీ నిలిపివేత స‌రికాద‌ని, త‌క్ష‌ణ‌మే తిరిగి ప్రారంభించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఆనందయ్య గత ఏడాదిగా దాదాపు 80 వేల మందికి కరోనా మందు అందించారని అందరూ కోలుకున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెపుతున్నారు.tv9abn{#}Ayurveda;media;television;Rajinikanth;Divya Bhatnagarటీవీ 9 ర‌జ‌నీకాంత్‌- ఏబీఎన్ వెంక‌ట‌కృష్ణ‌ల మ‌ధ్య యుద్ధం..?టీవీ 9 ర‌జ‌నీకాంత్‌- ఏబీఎన్ వెంక‌ట‌కృష్ణ‌ల మ‌ధ్య యుద్ధం..?tv9abn{#}Ayurveda;media;television;Rajinikanth;Divya BhatnagarThu, 27 May 2021 20:45:07 GMTకృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య ఇస్తున్న ఆయుర్వేద మందు శాస్త్రీయ‌త‌పై ఇంకా ప్ర‌భుత్వం అధికారికంగా ఏమీ తేల్చి చెప్ప‌లేదు. ఈ మందు పంపిణీ నిలిపివేత స‌రికాద‌ని, త‌క్ష‌ణ‌మే తిరిగి ప్రారంభించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఆనందయ్య గత ఏడాదిగా దాదాపు 80 వేల మందికి కరోనా మందు అందించారని అందరూ కోలుకున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెపుతున్నారు. మ‌రోప‌క్క ఇదే

అంశంపై ఇప్ప‌టికే అల్లోప‌తి వైద్యులు, ఆయుర్వేద నిపుణుల మ‌ధ్య వాద‌న‌లు జ‌రుగుతుండ‌గా.. ఇది మీడియా ప్ర‌తినిధుల మ‌ధ్య కూడా మాట‌ల యుద్ధానికి తెర‌తీసింది. ఏబీఎన్ వెంక‌ట‌కృష్ణ ఆనంద‌య్య మందుకు మ‌ద్ద‌తుగా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తుండ‌గా, టీవీ 9 ర‌జ‌నీకాంత్ అది కేవ‌లం ప‌స‌రు మాత్ర‌మేన‌ని, దానిని ప్ర‌జ‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం  ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తాను నిర్వ‌హించే డిబేట్ల‌లో వ్యతిరేక వాద‌న‌లు వినిపిస్తున్నారు. అంతేకాదు.. వీరిద్ద‌రి మ‌ధ్య ఇది ప్ర‌స్తుతం ప‌రోక్ష యుద్దానికి కూడా దారి తీసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఆనంద‌య్య‌ మందును కేవ‌లం ప‌స‌రు అనిచెప్పి త‌క్కువ‌చేసి చూపించే ప్ర‌య‌త్నం స‌రికాద‌ని, ప్ర‌కృతిలో స‌హ‌జంగా ల‌భించే ఆకులు, మూలిక‌ల‌తో చేసే ఆయుర్వేదం వేల సంవత్స‌రాలుగా భార‌తీయుల సొంత‌మ‌ని వెంక‌ట‌కృష్ణ ఏబీఎన్‌లో తాను నిర్వ‌హించే డిబేట్‌లో వ్యాఖ్యానించారు. త‌న వాద‌న‌కు మ‌ద్ద‌తుగా ఆయుర్వేద వైద్యుల అభిప్రాయాల‌ను, గ‌తంలో ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్‌లో ఒక ప్రొపెస‌ర్ చేసిన ఉప‌న్యాసాన్ని పేర్కొన్నారు. ఇక రజ‌నీకాంత్ టీవీ 9లో మొద‌టినుంచీ ఆనందయ్య ది కేవ‌లం నాటు వైద్యం అని పసరు అని గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ కార‌ణంగా జనం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో యాంకర్ రజనీకాంత్ త‌న వాద‌న జ‌నంలోకి తీసుకెళ్లేందుకు సుదీర్ఘమైన వ్యాసం రాసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో అసలు ఆనందయ్య క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ కాదని గుర్తుంచుకోవాల‌ని, చదువుకున్న విజ్ఞులు కూడా అయోమ‌యానికి గురికావ‌డం తొలిసారి చూస్తున్నానని అన్నారు. ఆనందయ్యది దివ్య ఔషధమని కొన్ని భజన బ్యాచ్‌లు అదే పనిగా ఊదరగొడుతున్నాయని.. ఆ మందు ఆయుర్వేదమే కాదంటూ వ్యాసంలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు

దశాబ్ధ క్రితం వరకూ పచ్చకామెర్లకు చేతికి వాతలు పెట్టుకునేవార‌ని, ఇప్పటికీ జ‌నంలో చాలామందికి చేతి మీద వాతలు కనిపిస్తాయ‌ని . అలాగే గతంలో పచ్చకామెర్లకు ఆకుపసరు కూడా ఇచ్చేవార‌ని, ఆనంద‌య్య మందు కూడా ఇలాంటిదేన‌ని ర‌జ‌నీకాంత్ వాద‌న‌. దీనినే న‌మ్మి స‌రైన వైద్యం చేయించుకోక‌పోతే రోగుల‌కుప్ర‌మాద‌మ‌ని ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు.  పాము ఎవరినైనా కాటువేస్తే దాని విషం కారణంగా కాకుండా భయంతో చనిపోయే వాళ్లే ఎక్కువ మంది ఉంటార‌ని, పసరు వైద్యంతో ఇక తమకు ఏమీకాదన్న ధైర్యంతో చాలా మంది కోలుకుంటారు తప్ప…ఆ పసరు మందు కారణం కాదని ర‌జ‌నీకాంత్ త‌న వ్యాసంలో తెలిపారు. మొత్తానికి ఈ ఇరువురు మీడియా ప్ర‌తినిధుల మ‌ధ్య సాగుతున్న‌మాట‌ల పోరులో ఎవ‌రివాద‌న‌లో నిజ‌ముంద‌న్న‌ది  రాబోయే రోజులే తేల్చాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్యాంక్ మోసం కేసులో స్థిర ఆస్తులు జత చేస్తున్న ED...

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>