MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-twist-in-akira-entry-becomes-news-in-mega-fans6886a896-96a7-4eb6-a1c4-fab32710d465-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-twist-in-akira-entry-becomes-news-in-mega-fans6886a896-96a7-4eb6-a1c4-fab32710d465-415x250-IndiaHerald.jpg ఈ లాక్ డౌన్ సమయంలో రేణు దేశాయ్ కరోనా బాధితులకు తనవంతు సహాయం అనేక విధాలుగా చేస్తోంది. తన సెల్ ఫోన్ ను ఒక కాల్ సెంటర్ గా మార్చుకుని రోజుకు 15 గంటల పాటు తనకు సహాయం చేయమని వస్తున్న మెసేజ్ లకు స్పందించడమే కాకుండా ఆమెకు పరిచయం ఉన్న కొన్ని ఎన్ జీ ఓ సంస్థలతో కలిసి ఆక్సిజన్ సిలిండర్ ల విషయంలో హాస్పటల్ బెడ్స్ విషయంలో కోరోనా రోగులకు సంబంధించిన మందుల విషయంలో తనవంతు సహాయాన్ని చేస్తూ తన సామాజిక స్పృహను చాటుకుంటోంది.ఈ పరిస్థితులలో ఈమధ్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా తరుచు నెటrenudesai;;pawan;jr ntr;kalyan;pawan kalyan;renu desai;varsha;mandula;smart phone;oxygen;pawan-kalyan;akira nandhanఅకిరా ఫిలిం ఎంట్రీ పై రేణు దేశాయ్ అసహనం !అకిరా ఫిలిం ఎంట్రీ పై రేణు దేశాయ్ అసహనం !renudesai;;pawan;jr ntr;kalyan;pawan kalyan;renu desai;varsha;mandula;smart phone;oxygen;pawan-kalyan;akira nandhanThu, 27 May 2021 08:01:49 GMT
ఈ లాక్ డౌన్ సమయంలో రేణు దేశాయ్ కరోనా బాధితులకు తనవంతు సహాయం అనేక విధాలుగా చేస్తోంది. తన సెల్ ఫోన్ ను ఒక కాల్ సెంటర్ గా మార్చుకుని రోజుకు 15 గంటల పాటు తనకు సహాయం చేయమని వస్తున్న మెసేజ్ లకు స్పందించడమే కాకుండా ఆమెకు పరిచయం ఉన్న కొన్ని ఎన్ జీ ఓ సంస్థలతో కలిసి ఆక్సిజన్ సిలిండర్ ల విషయంలో హాస్పటల్ బెడ్స్ విషయంలో కోరోనా రోగులకు సంబంధించిన మందుల విషయంలో తనవంతు సహాయాన్ని చేస్తూ తన సామాజిక స్పృహను చాటుకుంటోంది.


ఈ పరిస్థితులలో ఈమధ్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా తరుచు నెటిజన్ లతో ఛాట్ చేస్తూ వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెకు ఎదురైన ఒక ప్రశ్న తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఒక నెటిజన్ కరోనా పరిస్థితుల గురించి ఆమెతో ఛాట్ చేస్తూ మధ్యలో అకిరా నందన్ ఫిలిం ఎంట్రీ గురించి ప్రశ్నించాడు.


దీనితో తీవ్ర అసహనానికి లోనైన రేణు జనం ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే వాటి గురించి సీరియస్ గా ఆలోచించకుండా ఇప్పుడు అకిరా నందన్ ఫిలిం ఎంట్రీ వ్యవహారం అంత ముఖ్యమా అంటూ ఆమె ప్రశ్నించింది. అంతేకాదు జనం కష్టాల గురించి తాను మాట్లాడుతుంటే అభిమానులు సినిమాల గురించి మాట్లాడటం ఎంత వరకు అవసరం అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది.


గతంలో కూడ ఇలాగే ఒక వీరాభిమాని రేణు దేశాయ్ తో అకిరా ఫిలిం ఎంట్రీ గురించి మాట్లాడుతూ జూనియర్ పవర్ స్టార్ అంటూ ఒక ట్యాగ్ క్రియేట్ చేసాడు. దీనిపై అప్పట్లో రేణు మండిపడుతూ తన కొడుకును జూనియర్ పవర్ స్టార్ గా చూడాలనే కోరిక లేదని తనకు తను స్వయంశక్తితో ఎదిగిన అకిరా నందన్ గా చూడాలనే తన కోరిక అంటూ ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులకు ధీటైన సమాధానం యిచ్చింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఈ పవర్ ఫుల్ రిప్లయ్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బే కరోననా.. చాన్సే లేదు?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>