Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-muriki-vade-dheshaniki-aadharsham-ayindhi3ba4bb3f-1114-407f-8ff7-e7bbf5b60fdf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-muriki-vade-dheshaniki-aadharsham-ayindhi3ba4bb3f-1114-407f-8ff7-e7bbf5b60fdf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతుంది. కానీ అదే సమయంలో ప్రజల్లో ధైర్యం పెరిగి పోతుంది కరోనా పై పోరాటం ఎలా చేయాలి అనే దానిపై అవగాహన పెరిగిపోతుంది. సామాన్యులు సైతం ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధం అయ్యి మాస్క్, భౌతిక దూరం అనే ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకప్పుడు కరోనా వైరస్ కేసులకు హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాలు సైతం ప్రస్తుతం ప్రజల్లో అవగాహన రావడంతో అతి తక్కువ కేసులో ఉన్న ప్రాంతాలు గా మారిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ భారత్లోకి వెలుగులోకి Corona{#}Coronavirus;Mumbai;wednesday;Februaryఆ మురికి వాడే.. దేశానికి ఆదర్శమైంది?ఆ మురికి వాడే.. దేశానికి ఆదర్శమైంది?Corona{#}Coronavirus;Mumbai;wednesday;FebruaryThu, 27 May 2021 18:05:00 GMTకరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధం అయ్యి మాస్క్, భౌతిక దూరం అనే ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకప్పుడు కరోనా వైరస్ కేసులకు హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాలు సైతం ప్రస్తుతం ప్రజల్లో అవగాహన రావడంతో అతి తక్కువ కేసులో ఉన్న ప్రాంతాలు గా మారిపోతున్నాయి.


 ముఖ్యంగా కరోనా వైరస్ భారత్లోకి వెలుగులోకి  వచ్చిన నాటి నుంచి  వైరస్కు హాట్ స్పాట్ గా మారిపోయింది మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబై నగరంలో అయితే ఇక కరోనా వైరస్ కేసులు  ప్రమాదకర రీతిలో పెరిగిపోయాయి. ఇక ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ అయినా ముంబైలోని దారవిలో గతంలో కరోనా కేసులు ఎలా వెలుగులోకి వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కడుపు కోసం పోరాటం చేస్తూనే.. మరోవైపు ఇక ప్రాణాలు తీసే కరోనా పై కూడా పోరాటం చేస్తూ అల్లాడిపోయారు ధారవి ప్రాంత ప్రజలు.   వైరస్ పై సరైన అవగాహన లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయ్.



 కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారిపోయిన ఆ మురికివాడ ఇక ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.  అప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతం.. ఇక ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కేసులు నమోదు కాని ప్రాంతంగా మారిపోయింది.  ఇప్పటివరకు ధారవి ప్రాంతంలో 6798 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి..  ఇక ఇందులో 36 శాతం కేసులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి.  ధారవి ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇటీవలే బుధవారం రోజున ధారవి ప్రాంతంలో కేవలం మూడంటే మూడు కొత్త  కేసులు వెలుగు లోకి వచ్చాయి అంటే ఆశ్చర్యపోక మానరు. ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ లో ఫిబ్రవరి 11 తర్వాత ఈ రేంజిలో తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ మూవీ కి పవర్ఫుల్ టైటిల్ ..... ??

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>