PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/anil-kumar-yadava8271932-ab79-474f-8f83-16f354885df5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/anil-kumar-yadava8271932-ab79-474f-8f83-16f354885df5-415x250-IndiaHerald.jpgజగన్ కేబినెట్‌లో బాగా దూకుడుగా ఉండే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నెల్లూరు సిటీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్, జగన్ కేబినెట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక మంత్రిగా అనిల్ దూసుకెళుతున్నారు. ఓ వైపు తన శాఖపై పట్టు పెంచుకుంటూనే, మరోవైపు ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టడంలో ముందున్నారు.anil kumar yadav;kumaar;anil music;gautham new;gautham;jagan;mekapati goutham reddy;district;mla;minister;cheque;aqua;yuva;p anil kumar yadav;anil kumar singhal;reddy;dookudu;mantraఅనిల్, గౌతమ్‌ల్లో షాక్ తగిలేది ఎవరికో?అనిల్, గౌతమ్‌ల్లో షాక్ తగిలేది ఎవరికో?anil kumar yadav;kumaar;anil music;gautham new;gautham;jagan;mekapati goutham reddy;district;mla;minister;cheque;aqua;yuva;p anil kumar yadav;anil kumar singhal;reddy;dookudu;mantraThu, 27 May 2021 03:00:00 GMTజగన్ కేబినెట్‌లో బాగా దూకుడుగా ఉండే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నెల్లూరు సిటీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్, జగన్ కేబినెట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక మంత్రిగా అనిల్ దూసుకెళుతున్నారు. ఓ వైపు తన శాఖపై పట్టు పెంచుకుంటూనే, మరోవైపు ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టడంలో ముందున్నారు.


అయితే అనిల్‌కు పూర్తి అపోజిట్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉంటారు. ఆత్మకూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్, జగన్ కేబినెట్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన చాలా సైలెంట్‌గా పనిచేసే నాయకుడు. గౌతమ్ మంత్రిగా కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు. అనిల్‌లాగా ప్రతిపక్షాలపై దూకుడుగా విమర్శలు చేయరు. ఏదైనా నిదానంగా నిర్మాణాత్మకమైన విమర్శలే చేస్తారు.


ఇలా నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు యువ మంత్రులు జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్నారు.  అయితే మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. పాతవారిలో కొందరిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల్లో జగన్ ఎవరిని పక్కనబెట్టి ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు మంత్రులు అటు ప్రభుత్వానికి గానీ, ఇటు పార్టీకి గానీ మంచి అడ్వాంటేజ్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఎవరిని పక్కనబెట్టడానికి అవకాశాలు కనిపించడం లేదు.


అలాగే ఈ ఇద్దరినీ ఇలాగే కొనసాగించి మరొక ఎమ్మెల్యేకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వొచ్చు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి జగన్ కేబినెట్‌లో ఛాన్స్ దక్కనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలా కొత్త వారికి ఛాన్స్ ఇస్తే, పాత మంత్రులైన అనిల్, గౌతమ్ రెడ్డిలని కొనసాగించే అవకాశం ఉంది. అయినా జగన్ మదిలో ఏముందో తెలియాలంటే మరో ఆరు నెలలు ఆగాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ పాలిటిక్స్: ఈటలని బుక్ చేసినట్లేనా..!

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>