EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-review-meetingbe039862-528b-4a04-8b35-de3e83d1d99d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-review-meetingbe039862-528b-4a04-8b35-de3e83d1d99d-415x250-IndiaHerald.jpgసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్య‌యానికి సంబంధించిన అంచ‌నాలు పెరుగుతూ ఉండ‌టం స‌హ‌జ‌మే. ఏ కార‌ణంగానైనా నిర్మాణంలో కాల‌యాప‌న జ‌రిగితే అంచ‌నాలు మ‌రింత ఎగ‌బాకుతాయి. ఒక్కోసారి నాయ‌కులు, అధికారుల చేతివాటం తోడైతే ఇవి అసాధార‌ణంగా కూడా పెర‌గొచ్చు. తాజాగా ఇలాంటి అంశ‌మే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల‌పై రెండు రోజుల క్రితం నిర్వ‌హించిన స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ట‌. దీనిపై సీఎం కేసీఆర్ గ‌ట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌.kcr review meeting{#}Telangana;KCR;CM;Telangana Rashtra Samithi TRS;Minister;Sakshi;Vemuri Radhakrishna;Tom Banton;Tom Hooper;Party;KOTIఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?kcr review meeting{#}Telangana;KCR;CM;Telangana Rashtra Samithi TRS;Minister;Sakshi;Vemuri Radhakrishna;Tom Banton;Tom Hooper;Party;KOTIThu, 27 May 2021 18:22:34 GMT సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్య‌యానికి సంబంధించిన అంచ‌నాలు పెరుగుతూ ఉండ‌టం స‌హ‌జ‌మే. ఏ కార‌ణంగానైనా నిర్మాణంలో కాల‌యాప‌న జ‌రిగితే అంచ‌నాలు మ‌రింత ఎగ‌బాకుతాయి. ఒక్కోసారి నాయ‌కులు, అధికారుల చేతివాటం తోడైతే ఇవి అసాధార‌ణంగా కూడా పెర‌గొచ్చు.  తాజాగా ఇలాంటి అంశ‌మే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల‌పై రెండు రోజుల క్రితం నిర్వ‌హించిన స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ట‌. దీనిపై సీఎం కేసీఆర్ గ‌ట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌.

ఇంత‌కీ విష‌య‌మేమిటంటే ‘కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో.. ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాల‌ని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 2017 జూన్‌లో రూ.1,067 కోట్ల అంచ‌నాతో దీనికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 15 నెలల్లో ఈ ప్రాజెక్టును  పూర్తి చేయాలన్న‌ది అప్ప‌ట్లో కేసీఆర్ ప్ర‌భుత్వ ల‌క్ష్యం. అయితే. టెండర్ల ప్రక్రియ మొదలైన ఆరు నెలలకే డిజైన్‌లో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,067 కోట్ల నుంచి.. రూ.1,751.46 కోట్లకు పెంచారు. అంటే ఏకంగా దాదాపు 70 శాతం పెరిగింద‌న్న‌మాట‌. దీనిపై స్టేట్లెవల్ స్టాండింగ్ కమిటీ అప్ప‌ట్లో అభ్యంతరాలు వ్య‌క్తం చేసినా..ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో దీనికి ఆమోద ముద్ర ప‌డింది. ఇప్పటికే మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్‌ శాఖ వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం..  ప్రాజెక్టుపై ఇప్ప‌టిదాకా రూ.1,700 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ప్రాజెక్టు పూర్తికాలేదుస‌రిక‌దా..అధికారులు మ‌రోసారి అంచనాలను సవరిస్తూ మ‌రో రూ. 248.55 కోట్లు పెంచి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అంటే ప్రాజెక్టు వ్య‌యం తాజాగా రూ. 2 వేల కోట్ల‌కు చేరుకుంద‌న్న‌మాట‌. ’ ఈ విషయాన్ని స‌మావేశంలో ఓ  మంత్రి ప్ర‌త్యేకంగా లేవనెత్తార‌ట‌. ఇదే అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ భారీ స్థాయిలో ప‌నులు జ‌రుగుతున్న ఇరిగేషన్‌ శాఖలో చిన్నచిన్న తప్పులు జరుగుతున్నా, ఉపేక్షిస్తూ వస్తున్నానని.. దీన్ని అవ‌కాశంగా తీసుకుని ఇష్టారీతిన‌ వ్యవహరిస్తే ‘వీపులు పగులుతాయ్‌’ అంటూ అధికారుల‌ను ఘాటుగా హెచ్చరించారని సమాచారం.’ ఇది సాక్షి ప‌త్రిక‌లో వ‌చ్చిన‌ ఇన్సైడ్ స్టోరీ.

 ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం– అంచనాలు రెట్టింపా.?’ శీర్షిక‌న‌ సాక్షి ఈ స్టోరీని ప్రజెంట్ చేసింది. ఈ నెల 25న సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ఇరిగేషన్పై రివ్యూ నిర్వహించి, ప్రాజెక్టుల ప్రాధాన్యంపై వివరించారు. దీనిపై మీడియాలో కూడా ప‌లు క‌థ‌నాలు వచ్చాయి. కానీ ఎస్సారెస్పీ అంచ‌నాల పెంపుపై చ‌ర్చ మాత్రం ఒక‌రోజు ఆలస్యంగానైనా సాక్షిలో మాత్ర‌మే వ‌చ్చింది. నిజానికి ఇలాంటి వార్త‌లు ఆంధ్ర‌జ్యోతిలో ఎక్స‌క్లూజివ్‌గా వ‌స్తాయ‌నే పేరుంది. సీఎం కేసీఆర్‌తో .. రాధాకృష్ణ సంబంధాలు టామ్ అండ్ జెర్రీ పోరాటాన్ని త‌ల‌పిస్తాయి.అయితే ఈ ఐట‌మ్‌ను ఆంధ్ర‌జ్యోతి ఎందుక‌నో వ‌దిలేసింది. ఒక‌వేళ ఆ ప‌త్రిక‌లో గ‌నుక ఇది వ‌స్తే మ‌రింత మ‌సాలాలు అద్దుకుని సంచ‌ల‌న‌మ‌య్యేదేమో.

  వాస్త‌వానికి  తెలంగాణ‌లో ఇలా ప్రాజెక్టుల వ్య‌యం పెర‌గ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. దీనిపై విప‌క్షాల‌నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి కూడా. అయితే దీనిపై అధికార  అధికార పార్టీ నేత‌లెరూ నోరువిప్పే సాహ‌సం చేయ‌లేదు. తెలంగాణలో కోటి ఎక‌రాల‌కు నీరివ్వ‌డ‌మే ల‌క్ష్య‌మంటూ కేసీఆర్ మాన‌స పుత్రిక‌గా ఆ ప్రాజెక్టును చేప‌ట్ట‌డ‌మే కార‌ణం. మంత్రి హ‌రీష్‌రావు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని ఆ ప్రాజెక్టు ప‌నుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించిన విష‌యం తెలిసిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తండ్రికి బ్లాక్ ఫంగస్.. కొడుకు ఏం చేసాడో తెలుసా?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>