PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayyaa69e2463-2937-42bf-a925-c37c466867ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayyaa69e2463-2937-42bf-a925-c37c466867ac-415x250-IndiaHerald.jpgఆనందయ్య వైద్యంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు ఆనందయ్యకు అనుకూలంగా.. మరికొందరు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆనందయ్య తన వైద్య విధానం గురించి తానుగా ఎటువంటి ప్రచారం చేసుకోలేదు. వైద్యంతో వ్యాపారం చేయలేదు. వందలు, వేల మందిని రప్పించుకుని వైద్యం చేసే ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించుకోలేదు. తరతరాలుగా వారసత్వంగా నేర్చుకున్న చికిత్స విధానంతో తన వద్దకు వచ్చిన వారికి ఉపశమనమో, ఊరటో కలిగిస్తున్నారు. అయితే.. కొంతమంది రాజకీయ నాయకుల అత్యుత్సాహమో, నిజంkrishnapatnam-anandayya;march;nijam;racchaరూల్స్ అన్నీ ఆనందయ్యకేనా.. మరి వీళ్ల సంగతేంటి..?రూల్స్ అన్నీ ఆనందయ్యకేనా.. మరి వీళ్ల సంగతేంటి..?krishnapatnam-anandayya;march;nijam;racchaThu, 27 May 2021 09:00:00 GMTఆనందయ్య వైద్యంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు ఆనందయ్యకు అనుకూలంగా.. మరికొందరు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆనందయ్య తన వైద్య విధానం గురించి తానుగా ఎటువంటి ప్రచారం చేసుకోలేదు. వైద్యంతో వ్యాపారం చేయలేదు. వందలు, వేల మందిని రప్పించుకుని వైద్యం చేసే ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించుకోలేదు. తరతరాలుగా  వారసత్వంగా నేర్చుకున్న చికిత్స విధానంతో తన వద్దకు వచ్చిన వారికి ఉపశమనమో, ఊరటో కలిగిస్తున్నారు.

అయితే.. కొంతమంది రాజకీయ నాయకుల అత్యుత్సాహమో, నిజంగానే జనానికి మేలు జరుగుతుందని నమ్మి చేసిన ప్రచారమో ఈ సమస్యను తెరపైకి తెచ్చింది. అంతలోనే ఇంత రచ్చ చేయవలసినది ఏముందో అర్థం కాదు. ఆనందయ్య వైద్యం వల్ల ఏమన్నా జరిగితే ఎవరిది బాధ్యత? అని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిజమే కానీ.. మరి ఆసుపత్రుల మాటేమిటి.. అక్కడ కూడా  ‘మీకు ఏమి జరిగినా మా బాధ్యతలేదు’ అని ప్రతి పెషేంట్ బంధువులు ముందుగానే  ప్రమాణ పత్రాలు   రాయించుకుంటున్నారు కదా ? అంత శాస్త్రబద్ధమైన చికిత్స అయినప్పుడు ముందే ప్రమాణ పత్రాలు ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే ఆ చికిత్సకు కూడా హామీ లేదని అర్థం.
 
అంతెందుకు? కోవిడ్ చికిత్సకు సంబంధించిన ప్రొటొకాల్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇప్పటికి ఎన్నిసార్లు మార్చిందో ఎవరైనా లెక్క చెప్పగలరా? రెమిడీసీవర్ ముందు వాడమని చెప్పిందెవరు? ఇప్పుడు తగ్గించమని చెప్పిందెవరు? స్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వస్తాయని ముందుగా ఎందుకు తెలియరాలేదు? ఎందుకు తెలియలేదు అంటే కోవిడ్ చికిత్సకు సంబంధించి ఏది ఎంతవరకు వాడాలో ముందుగా ప్రయోగాలేమీ జరగలేదు.

వాస్తవానికి కరోనా అంత సమయం ప్రపంచానికి ఇవ్వలేదు. ఉప్పెనలో కొట్టుకుపోతున్నవాడు గట్టి ఆధారమే కావాలని ఎదురు చూడడు. గడ్డిపోచ దొరికినా, చెట్టుకొమ్మ దొరికినా అలుముకుంటాడు. ఇప్పుడు పేషేంట్లు, డాక్టర్లు అందరి పరిస్థితీ అదే. అందుకే రోగికి ఉపశమనం కలిగిస్తున్న ప్రతి వైద్యాన్ని అనుమతిద్దాం..పరిశీలిద్దాం.. పరిశోధిద్దాం.. ఆ తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందాం. కేవలం ఆనందయ్యకే రూల్స్ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజనం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్ : మార్కెట్ లోకి నేడే!

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>