PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-f92a7328-4bd4-46f7-88d9-7b99171c502c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-f92a7328-4bd4-46f7-88d9-7b99171c502c-415x250-IndiaHerald.jpgఏపీలో కేబినెట్ మార్పిడికి ముహూర్తం దగ్గరవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు అవకాశం రాని వారికి రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు రానున్నాయి.jagan;madhusudhan;jagan;district;maddisetty venugopal;cabinet;mla;minister;prakasam district;prakasm;kanigiri;research and analysis wing;reddy;mantra;venu thottempudi;srinivas;sudhakar;ram madhav;venu;sureshఆ జిల్లాకు జగన్ మరో బెర్త్ ఇస్తారా?ఆ జిల్లాకు జగన్ మరో బెర్త్ ఇస్తారా?jagan;madhusudhan;jagan;district;maddisetty venugopal;cabinet;mla;minister;prakasam district;prakasm;kanigiri;research and analysis wing;reddy;mantra;venu thottempudi;srinivas;sudhakar;ram madhav;venu;sureshWed, 26 May 2021 03:00:00 GMTఏపీలో కేబినెట్ మార్పిడికి ముహూర్తం దగ్గరవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు అవకాశం రాని వారికి రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు రానున్నాయి.


ఇక అప్పుడు ఛాన్స్ కొట్టేయాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అలాగే పదవులు కాపాడుకోవాలని కేబినెట్‌లో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఏది ఎలా జరిగినా మంత్రివర్గం నుంచి కొందరిని తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎవరిని తప్పించి, ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది సస్పెన్స్‌గానే ఉంది. కానీ జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా పదవులు పంపకం చేయడం గ్యారెంటీ.


అయితే ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు మంత్రులుగా ఉన్నారు. ఇక వీరిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తప్పించడం కష్టమని తెలుస్తోంది. ఆయన చివరి వరకు కేబినెట్‌లో కొనసాగనున్నారు. ఇక సురేష్ విషయంలో క్లారిటీ లేదు. అయితే జగన్ ఈ ఇద్దరిని మంత్రివర్గంలో కొనసాగించి, ఇంకొక మంత్రి పదవి ఇస్తారా లేక ఒకరిని తప్పించి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తారా అనేది చెప్పలేం.  


అయితే ఏది ఎలా జరిగినా ప్రకాశం జిల్లాలో మరో ఎమ్మెల్యేకు మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మంత్రి రేసులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కందుకూరు ఎమ్మెల్యే  మానుగుంట మహీధర్ రెడ్డిలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌లు సైతం పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ప్రకాశం జిల్లాలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో? ఏ ఎమ్మెల్యే మంత్రి పదవి సాధిస్తారో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>