PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh38d931d5-cdb4-4096-b226-ce7f2227f108-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh38d931d5-cdb4-4096-b226-ce7f2227f108-415x250-IndiaHerald.jpgనారా లోకేష్...టీడీపీకి భవిష్యత్ నాయకుడు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేష్ అని ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అందుకే గత కొంతకాలంగా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబుతో పాటు పార్టీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా చినబాబు తన వంటితీరు, మాటతీరు రెండు మార్చుకున్నారు.nara lokesh;cbn;lokesh;nara lokesh;2019;government;media;arrest;ycp;lokesh kanagaraj;s radhakrishna;dookudu;party;narendraచినబాబు ఆ పని కూడా చేస్తే బెటర్...చినబాబు ఆ పని కూడా చేస్తే బెటర్...nara lokesh;cbn;lokesh;nara lokesh;2019;government;media;arrest;ycp;lokesh kanagaraj;s radhakrishna;dookudu;party;narendraWed, 26 May 2021 13:00:00 GMTనారా లోకేష్...టీడీపీకి భవిష్యత్ నాయకుడు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేష్ అని ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అందుకే గత కొంతకాలంగా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబుతో పాటు పార్టీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా చినబాబు తన వంటితీరు, మాటతీరు రెండు మార్చుకున్నారు.


అలాగే వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పార్టీ తరుపున పోరాడుతున్నారు. అలాగే తమ నేతల మీదగానీ, తమ కార్యకర్తల మీద గానీ వైసీపీ ప్రభుత్వం కేసులు పెడితే గట్టిగానే నిలబడుతున్నారు. వారు అరెస్ట్ అయ్యి జైలుకెళితే మరింతగా చినబాబు పోరాటం చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ వారికి అండగా ఉంటున్నారు. అలాగే వారు జైలు నుంచి వచ్చాక పరామర్శిస్తున్నారు.


ఈ విధంగా చినబాబు తమ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. అయితే సంగం డైరీ విషయంలో జైలుకెళ్లిన ధూళిపాళ్ళ నరేంద్ర తాజాగా బెయిల్ బయటకొచ్చారు. నరేంద్ర రావడమే ఆలస్యం...చినబాబుని ఆయన్ని పరామర్శించడానికి వచ్చేశారు. ఇలా నాయకులు, కార్యకర్తల కోసం నిలబడుతున్న లోకేష్, జనం కోసం నిలబడితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కొందరు తెలుగు  తమ్ముళ్ళు భావిస్తున్నారు. కరోనా సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.


వారి కోసం డైరక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగి సాయం అందిస్తే మరింత బాగుంటుందని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న చినబాబు, నేరుగా ప్రజల మధ్యలోనే ఉండి పోరాడితే బెటర్ అని తమ్ముళ్ళు భావిస్తున్నారు.  కరోనా ఉన్నా సరే నాయకులని పరామర్శించడానికి వెళుతున్న చినబాబు, కరోనా నిబంధనలు పాటిస్తూ జనాల కోసం పనిచేస్తే, పార్టీకే అడ్వాంటేజ్ అవుతుందని, అలా కాకుండా కేవలం సోషల్ మీడియాలోనే పోరాటం చేస్తే, అది సామాన్య ప్రజలకు తెలియదని, కాబట్టి ఇకనుంచైనా ప్రజల మధ్యలోకి వస్తే బాగుంటుందని చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?

ఉద‌య్‌కిర‌ణ్ కేరీర్‌లో మిస్సైన సినిమాలు ఇవే...!

రామ్ చరణ్ ని ఊరిస్తున్న సరికొత్త రికార్డు.!!

ఆస్థి కోసం కోర్టు మెట్లెక్కిన శ్రీదేవి చెల్లెలు..ఏం జరిగింది .. ?

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>