PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona539ac303-fd52-43ec-b4fd-4271f5ce078b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona539ac303-fd52-43ec-b4fd-4271f5ce078b-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారితో భారత్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలిస్తుంది. రోజుకి 4 లక్షల కొత్త కేసులు నమోదయిన దుస్థితి నుంచి రోజుకి 2 లక్షల కేసులకు చేరుకుంది. ఈ విజయాన్ని దేశ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం ద్వారా సాధించాయి. మొదట్లో కేసులు నెమ్మదించినా, మరణాలు మాత్రం అధికంగా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య కూడా గణనీయంగా..corona;india;russia;italy;spain;singapore;university;december;survey;central government;juneభారత్‌కు మంచి రోజులు.. చెప్పిన సింగపూర్..భారత్‌కు మంచి రోజులు.. చెప్పిన సింగపూర్..corona;india;russia;italy;spain;singapore;university;december;survey;central government;juneWed, 26 May 2021 14:11:00 GMTకరోనా మహమ్మారితో భారత్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలిస్తుంది. రోజుకి 4 లక్షల కొత్త కేసులు నమోదయిన దుస్థితి నుంచి రోజుకి 2 లక్షల కేసులకు చేరుకుంది. ఈ విజయాన్ని దేశ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం ద్వారా సాధించాయి. మొదట్లో కేసులు నెమ్మదించినా, మరణాలు మాత్రం అధికంగా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కరోనాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేయడంతో పాటు కావలసిన వ్యాక్సిన్ డోసులను సిద్దం చేయిస్తున్నాయి. అంతేకాకుండా కరోనాను నిలువరించేందుకు విదేశీ వ్యాక్సిన్‌లకు ఆమోదం తెలుపుతున్న విషయం తెలిసిందే.


ఇప్పటికే దేశంలో కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ వాడుతున్నారు. తాజాగా వీటిలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ చేరింది. మరిన్ని సంస్థలతో కేంద్ర ప్రభుతం చర్చలు జరుపుతుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆగస్టు నాటికి 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇండియాకు తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా దేశీయ సంస్థలు భారత బయోటెక్, సీరమ్ కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికం చేస్తున్నట్లు ప్రకటించాయి. భారత్ బయోటెక్ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నామని, అన్నీ అనుకున్నట్లు జరిగితే నెలకు 100 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణకు సంబంధించి అనేక విశ్వవిద్యలయాలు సర్వేలు చేస్తున్నాయి.



అయితే ఇటీవల సింగపూర్‌కు చెందిన ఓ యూనివర్సిటీ ఇదే తరహా సర్వేను చేసింది. ఈ సర్వేను మొత్తం 131 దేశాలపై చేశారు. వీరి సర్వే ప్రకారం జూన్ 18 నాటికి భారత్‌లో 97శాతం కరోనా తగ్గుతుందని, పూర్తి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ నాటికి కరోనా నాలుగింట మూడు భాగాలు తగ్గుతుందని తెలిపింది. అయితే ఇదే యూనివర్సిటీ ఇది వరకు ఇటలీ, స్పెయిన్ విషయంలో కూడా సర్వేను చేసింది. వీరు చేసిన సర్వే నిజమైతే భారత్‌కు అతి త్వరలోనే మంచి రోజులొస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దర్శకేంద్రుడిపై నోరు జారిన తాప్సి... అప్పట్లో పెద్ద దుమారం లేపిన కాంట్రావెర్సీ

శ్రీదేవి, జయప్రద వివాదంలో ఇంత మ్యాటర్ ఉందా ..... ??

మినీ కథకి మూలం అదే.. రచయిత ఆసక్తికర కామెంట్స్!

దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?

ఉద‌య్‌కిర‌ణ్ కేరీర్‌లో మిస్సైన సినిమాలు ఇవే...!

రామ్ చరణ్ ని ఊరిస్తున్న సరికొత్త రికార్డు.!!

ఆస్థి కోసం కోర్టు మెట్లెక్కిన శ్రీదేవి చెల్లెలు..ఏం జరిగింది .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>