PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya6993c3b0-0a4e-4bfb-a9de-7655c09a5bf9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya6993c3b0-0a4e-4bfb-a9de-7655c09a5bf9-415x250-IndiaHerald.jpgఆనందయ్య.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోగిపోతున్న పేరు.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. కరోనా నుంచి పేదలను కాపాడే వ్యక్తిగా ఆయన ఇమేజ్ పెరిగింది. అయితే.. ఆయన మందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నందువల్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ సమయంలో ఆనందయ్యతో పలువురు నాయకులు కలుస్తున్నారు. తాజాగా.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆనందయ్య మందుకు ముందుగా మద్దతు తెలిపి.. పంపిణీని ప్రారంభించింది కూడా కాకాణి గోవర్థన్ రెడ్డే. కృష్ణపట్నం ఆనందయ్య తో చర్krishnapatnam-anandayya;kakani govardhan reddy;district;chief minister;mla;ayurveda;indian postal service;central government;ycp;venkaiah naidu;reddyఆనందయ్యతో వైసీపీ ఎమ్మెల్యే చర్చలు.. ఏం తేల్చారంటే..?ఆనందయ్యతో వైసీపీ ఎమ్మెల్యే చర్చలు.. ఏం తేల్చారంటే..?krishnapatnam-anandayya;kakani govardhan reddy;district;chief minister;mla;ayurveda;indian postal service;central government;ycp;venkaiah naidu;reddyWed, 26 May 2021 07:00:00 GMTఆనందయ్య.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోగిపోతున్న పేరు.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. కరోనా నుంచి పేదలను కాపాడే వ్యక్తిగా ఆయన ఇమేజ్ పెరిగింది. అయితే.. ఆయన మందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నందువల్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ సమయంలో ఆనందయ్యతో పలువురు నాయకులు కలుస్తున్నారు. తాజాగా.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆనందయ్య మందుకు ముందుగా మద్దతు తెలిపి.. పంపిణీని ప్రారంభించింది కూడా కాకాణి గోవర్థన్ రెడ్డే.

కృష్ణపట్నం ఆనందయ్య తో చర్చలు జరిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నిపుణుల బృందం నివేదికలు సమర్పించి, ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే మందు పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆనందయ్య ఆయుర్వేద మందును చాలామంది కోరుకుంటున్నారని... అవసరమైన మేర మందు తయారీకి సిద్ధంగా ఉన్నామని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలతో పాటు, జిల్లావ్యాప్తంగా అవసరమైన వారందరికీ అందజేస్తామని కాకాణి చెప్పారు.

ఆనందయ్య ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరుగుతున్న పరిస్థితులలో మందు కోసం ఎవ్వరూ కూడా కృష్ణపట్నం గ్రామానికి రావద్దని కాకాణి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆన్లైన్ పద్ధతి పోస్టల్ లేదా కొరియర్ సర్వీసు ద్వారా పంపించే ఏర్పాటు చేస్తామన్నారు కాకాణి గోవర్థన్‌ రెడ్డి. ప్రజలు కృష్ణపట్నానికి తరలివచ్చి, కరోనా సోకిన వారు, కరోనా నివారణకు వచ్చిన వారు మందు కోసం గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని కాకాణి అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, ఆనందయ్య ఆయుర్వేద మందు పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని కాకాణి తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కేంద్ర ఆయుష్ శాఖ తో ఆయుర్వేద మందు అధ్యయనంపై దృష్టి సారించవలసినదిగా కోరారని.. ప్రతిపక్షం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, ఆనందయ్య ఆయుర్వేద మందును కూడా తమ నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడం దారుణమని కాకాణి విమర్శించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>