PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-cave51470d7a-73a6-4e75-8a2a-378da937b21e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-cave51470d7a-73a6-4e75-8a2a-378da937b21e-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది.. ఈ ప్రశ్నకు చిన్న పిల్లాడు కూడా చైనాలోని వుహాన్ అని చెబుతాడు. ఇక్కడ పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కోట్లమంది ప్రాణాలు హరిస్తోంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగింది. రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తం కరోనా నుంచి కాపాడుకోడమే లక్ష్యంగా బతుకుతోంది. అయితే ఈ కరోనా చైనాలో పుట్టిందని ఇప్పటి వరకూ సాధికారికంగా నిరూపించలేకపోతున్నారు. అయితే.. ఈ కరోనాయే కాదు.. గతంలోని కొన్ని మహమ్మారులకూ చైనాయే పుట్టినిల్లట. అంతే కాదు.. ఇంకొన్ని మహమ్మారులు కూడా చైchina-cave;american samoa;coronavirusచైనాలోని ఆ గుహ.. ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందా..?చైనాలోని ఆ గుహ.. ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందా..?china-cave;american samoa;coronavirusWed, 26 May 2021 09:00:00 GMTకరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది.. ఈ ప్రశ్నకు చిన్న పిల్లాడు కూడా చైనాలోని వుహాన్ అని చెబుతాడు. ఇక్కడ పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కోట్లమంది ప్రాణాలు హరిస్తోంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగింది. రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తం కరోనా నుంచి కాపాడుకోడమే లక్ష్యంగా బతుకుతోంది. అయితే ఈ కరోనా చైనాలో పుట్టిందని ఇప్పటి వరకూ సాధికారికంగా నిరూపించలేకపోతున్నారు.

అయితే.. ఈ కరోనాయే కాదు.. గతంలోని కొన్ని మహమ్మారులకూ చైనాయే పుట్టినిల్లట. అంతే కాదు.. ఇంకొన్ని మహమ్మారులు కూడా చైనా నుంచి వచ్చే ప్రమాదం ఉందట. ఈ మహమ్మారులన్నింటికీ చైనాలోని ఓ గుహ కారణమట. ఆ గుహ నుంచి ఈ దిక్కుమాలిన వైరస్‌లు అన్నీ వస్తున్నాయట.  ఈ విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెబుతున్నాయట. ఈ విషయాన్ని  తాజాగా వాల్‌స్ట్రీట్‌ బయటపెట్టింది.

అంతే కాదు.. ఈ గుహ గురించి 2017లోనే నేచర్ పత్రిక బయటపెట్టింది. చైనాలో సార్స్‌కు కారణమైన వైరస్‌ మూలాలు ఉన్న గుహను కనుగొన్నట్లు 2017లో నేచర్‌ పత్రికలో కథనం వెలువడింది. భవిష్యత్తులో వ్యాపించే అంటు వ్యాధులకు ఇది కారణం కావచ్చని కూడా అప్పుడే నేచర్ పత్రిక  హెచ్చరించింది. ఈ కథనాన్ని నేచర్‌ పత్రికకు షాంఘైలో ఉన్న ఆసియా పసిఫిక్‌ కరస్పాండెంట్‌ డేవిడ్‌ సైరనోస్కీ  2017లోనే రాశారు.

ఇంతకీ ఆ గుహ ఎక్కడ ఉందో తెలుసా.. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ గుహ ఉందట. ఈ గుహ నుంచి వెలువడిన సార్స్ కారణంగానే 2002లో చైనాలో 800 మరణించారట. అప్పట్లో దీని కారణంగా గ్లోబల్‌ ఎమర్జెన్సీ కూడా విధించారు. అక్కడి గుహల్లోని గబ్బిలాల ద్వారానే సార్స్ వ్యాపించిందట.  భవిష్యత్తులో అంటువ్యాధులకు కారణం అయ్యే లక్షణాలు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయని అప్పట్లోనే  ‘ప్లోస్‌.ఓఆర్‌జీ’ పబ్లికేషన్‌లోనూ  ప్రచురించారట. మొత్తానికి ఈ చైనా గుహ ప్రపంచ వినాశనానికి దారి తీసేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ళ ఇంటికి నారాలోకేష్!

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>