MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/controversies-of-hero-heroinef8a25a60-d7b5-4193-9c5d-afd2cec6ca1c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/controversies-of-hero-heroinef8a25a60-d7b5-4193-9c5d-afd2cec6ca1c-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. Controversies-of-hero-heroine;ntr;ravi;balakrishna;gopichand;trisha krishnan;boyapati srinu;ravi teja;bollywood;tollywood;cinema;director;lion;heroine;nandamuri taraka rama rao;lion 1;dookudu;mass;krackబాలయ్యతో రొమాన్స్‌కి సిద్దమైన త్రిష..?బాలయ్యతో రొమాన్స్‌కి సిద్దమైన త్రిష..?Controversies-of-hero-heroine;ntr;ravi;balakrishna;gopichand;trisha krishnan;boyapati srinu;ravi teja;bollywood;tollywood;cinema;director;lion;heroine;nandamuri taraka rama rao;lion 1;dookudu;mass;krackWed, 26 May 2021 09:01:33 GMTచిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా యమ దూకుడుగా కెరీర్ కొనసాగిస్తున్నారు.

ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్న ఆయన, తన తదుపరి సినిమా కోసం మరో మాస్ దర్శకుడిని లైన్‌లో పెట్టారు. 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండనుందని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై పలువురి పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు త్రిషను ఓకే చేశారట.

అయితే ఇటీవలే రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన గోపీచంద్ మలినేని ఈ సారి మరింత పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన ఈ భారీ సినిమా కోసం నటీనటులను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ త్రిషపై ఆయన కన్ను పడిందని, వెంటనే ఆమెతో సంప్రదింపులు జరపగా ఓకే అనేసిందని తెలుస్తోంది.

దీంతో బాలయ్య బాబు- త్రిష కాంబోలో రాబోతున్న సన్నివేశాల కోసం పక్కాగా ప్లాన్ చేసి థియేటర్లలో నందమూరి అభిమానుల చేత గోల పెట్టించాలని చూస్తున్నారట డైరెక్టర్ గోపీచంద్. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ తారల వైపు చూస్తున్నారని టాక్. గతంలో 'లయన్' సినిమాలో బాలయ్యతో ఆడిపాడింది త్రిష. ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న BB3 షూటింగ్ ఫినిష్ కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు వస్తుందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ళ ఇంటికి నారాలోకేష్!

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>