PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-ts-news-telanganaf34b6304-aa14-4a09-95f8-175b955ae3fd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-ts-news-telanganaf34b6304-aa14-4a09-95f8-175b955ae3fd-415x250-IndiaHerald.jpgఢిల్లీ, మ‌హారాష్ట్ర‌ల్లో వేగంగా కొవిడ్ కేసుల న‌మోదు త‌గ్గ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయో తెలుసుకొని రావాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం తెలంగాణ‌లో 3,403 కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 21మంది వ‌ర‌కు మృతిచెందారు. కొవిడ్ క‌ట్ట‌డికి ఇప్ప‌టికే రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇంటింటికి ఫీవ‌ర్ స‌ర్వేద్వారా కొవిడ్ రోగుల‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైతే కిట్ల‌ను అందిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఆక్సిజ‌న్ సిలీండ‌ర్లు కొర‌త లేకుండా చ‌ర్య‌లుCM KCR, TS NEWS, TELANGANA;kcr;nithya new;delhi;korcha;arvind kejriwal;partyకేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌కేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌CM KCR, TS NEWS, TELANGANA;kcr;nithya new;delhi;korcha;arvind kejriwal;partyWed, 26 May 2021 09:28:00 GMTసీఎం కేసీఆర్‌కు ఏ విష‌యంలోనైనా ముందుచూపు ఎక్కువేన‌న్న పేరుంది. రాజ‌కీయాల్లోనూ, రాష్ట్రంలో ఏ స‌మ‌స్య‌నైనా ప‌సిగ‌ట్టి ప‌రిష్క‌రించ‌డంలో కేసీఆర్ త‌రువాత‌నే అని ఆ పార్టీ శ్రేణులు పొగిడేస్తుంటారు. అయితే క‌రోనా వైర‌స్ ఉధృతిని అంచ‌నా వేయ‌డంలో మాత్రం కేసీఆర్ విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ఎట్టిప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ పెట్ట‌న‌ని భీష్మించుకు కూర్చున్న కేసీఆర్.. ఊహించ‌ని రీతిలో కేసుల పెరుగుద‌ల‌తో పాటు, ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ రావ‌డంతో లాక్‌డౌన్ విధించాడు. ఈనెల 31 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంది. కొవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ విషయంలో ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాక‌పోవ‌టంతో.. కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్నార‌న్న టాక్ న‌డుస్తుంది.

ఢిల్లీలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేజ్రీవాల్ స‌ఫ‌ల‌మ‌య్యారు. గ‌తనెల చివ‌రి వ‌ర‌కు ఢిల్లీలో 30వేల కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మృతుల సంఖ్య భారీగానే న‌మోదైంది. ఆక్సిజ‌న్ సిలీండ‌ర్ల కొర‌త‌, ఆస్ప‌త్రుల్లో బెడ్స్ లేక‌పోవ‌టం ఇలా ఢిల్లీ సీఎం అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో క‌ఠిన నిర్ణ‌యాల‌తో ఢిల్లీలో కొవిడ్ ఉధృతిని క‌ట్ట‌డిచేస్తూ వ‌చ్చారు. నిత్యం వైద్య శాఖ అధికారుల‌తో స‌మీక్షలు చేయ‌డంతో పాటు క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేశారు కేజ్రీవాల్‌. కొవిడ్ సోకిన‌వారికి నేరుగా కొవిడ్ కిట్స్ ఇవ్వ‌డంతో పాటు.. అవ‌స‌ర‌మైతే  ఆక్సిజ‌న్ సిలీండ‌ర్లు ఇంటికే అందించారు. దీంతో క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతూ వ‌చ్చాయి. మే14 నాటికి 3,500 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, తాజాగా ఆ సంఖ్య 1568కి చేరింది. మ‌హారాష్ట్రంలోనూ పాజిటివ్ కేసుల న‌మోదు సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది.

ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌ల్లో వేగంగా కొవిడ్ కేసుల న‌మోదు త‌గ్గ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయో తెలుసుకొని రావాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం తెలంగాణ‌లో 3,403 కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 21మంది వ‌ర‌కు మృతిచెందారు. కొవిడ్ క‌ట్ట‌డికి ఇప్ప‌టికే రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇంటింటికి ఫీవ‌ర్ స‌ర్వేద్వారా కొవిడ్ రోగుల‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైతే కిట్ల‌ను అందిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఆక్సిజ‌న్ సిలీండ‌ర్లు కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయినా కొవిడ్ కేసుల తీవ్ర‌త త‌గ్గ‌డం లేదు. మ‌రోవైపు పూర్తిస్థాయిలో కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌ల్లో కొవిడ్ ఉధృతి ఏ విధంగా కంట్రోల్ అయింద‌న్న విష‌యాన్ని ప‌రిశీలించి రావాల‌ని, త‌ద్వారా తెలంగాణ‌లోనూ అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వ‌ర్గాలు పేర్కొటున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !

కిషన్ రెడ్డి క్లారిటీ.. ఈటల సీక్రెట్ వెలుగులోకి..

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>